ఎమ్మెల్యే పైలట్ క్షేమంగా ఉండాలని పూజలు
బషీరాబాద్ Basheerabad News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం తాండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారికి మొన్న ఉదయం కర్ణాటక రాష్ట్రానికి వెళ్తుండగా మార్గమధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే గారు క్షేమంగా ఉండడంతో ఈ రోజు మైల్వార్ గ్రామస్థులు బసవేశ్వర ఆలయంలో ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.అలాగే ఆ భగవంతున్ని ఆశీర్వాదాలతో మన తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారికి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని రాబోయే రోజుల్లో మరెన్నో విజయాలను పొందాలని భగవంతున్నికి పూజలు చేశారు.ఈ కార్యక్రమాలలో మైల్వార్ గ్రామస్థులు,భక్తులు,పూజారులు తదితరులు పాల్కొన్నారు.