ఏక్మాయి గ్రామంలో అక్రమంగా ఇసుక తరలింపు : ఎంఆర్ఓ
బషీరాబాద్ Basheerabad News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలో ఏక్మాయి గ్రామంలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని స్థానికులు ఎంఆర్ఓ కి ఫిర్యాదు చేయగా వెంటనే ఏక్మాయి గ్రామానికి రెవిన్యూ బృందం తహశీల్దార్ వై. వెంకటేశం, డిప్యూటీ తహశీల్దార్ వెంకటయ్య, ఆర్.ఐ వెంకటేష్, బయలుదేరి గ్రామ శివారులో అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ ను పట్టుకున్నారు.అదే గ్రామానికి చెందిన అంబు అనే వ్యక్తి మాజీ సర్పంచు నారాయణ కొడుకు మోహన్ ఎలాంటి అనుమతులు తీసుకోకుండా పట్టపగలే ట్రాక్టర్లను పెట్టి ఇసుక తరలిస్తున్నారని తెలియజేయగా ఈ సందర్భంలో తహశీల్దార్ వై.వెంకటేశం మాట్లాడుతూ ట్రాక్టర్ ఇంజన్ కు నెంబర్ లేదు, ట్రాక్టర్ ని సీజ్ చేసి ట్రాక్టర్ డ్రైవర్ మారుతి పై కేసు నమోదు చేసి జరిమానా విధిస్తున్నట్లు తెలిపారు. నాపరాతి ఘనులు అనుమతులు లేకుండా నడిపిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.





