ఈ విషయం తెలిస్తే రోజుకు 3 కప్పుల కాఫీ కచ్చితంగా తాగుతారేమో
Health News భారత్ ప్రతినిధి : రోజుకు మూడు కప్పుల కాఫీ లేదా టీ తీసుకునే వారికి మధుమేహం సహా హృద్రోగాలకు కారణమయ్యే జబ్బుల ముప్పు తగ్గుతుందని తాజా పరిశోధనలలో వెల్లడైంది. కాఫీ, టీలలోని కెఫైన్ వల్ల గుండె పదిలంగా ఉంటుందని తేలింది. మూడు కప్పుల కాఫీలతో శరీరంలోకి 200 నుంచి 300 మిల్లీగ్రాముల కెఫెన్ చేరుతుంది. కెఫైన్ ఉన్న ఉత్పత్తులు (చాక్లెట్లు, కొన్న రకాల ఎనర్జీ డ్రింకులు, స్నాక్ బార్స్) ఏవి తీసుకున్నా సరే మొత్తంగా రోజుకు 300 మిల్లీ గ్రాములు శరీరంలోకి చేరేలా చూసుకుంటే గుండె జబ్బుల రిస్క్ 40 నుంచి 48 శాతం తగ్గుతుందని చైనాకు చెందిన షుజౌ మెడికల్ కాలేజీ సూషౌ యూనివర్సిటీ సైంటిస్టులు చెప్పారు.
ఈ మేరకు యూకో బయోబ్యాంక్ డాటా నుంచి లక్షలాది వ్యక్తుల వివరాలను సేకరించి, పరిశీలించి ఈ విషయాన్ని గుర్తించామన్నారు. ఇందులో 1.72 లక్షల మంది వాలంటీర్లు కాఫీ తాగేవారిని, 1.88 లక్షల మంది కాఫీ, టీ రెండూ తాగేవారిని పరీక్షించి చూశామన్నారు. కెఫైన్ తీసుకోని వారు, రోజుకు కేవలం వంద మిల్లీగ్రాములు మాత్రమే తీసుకునేవారితో పోలిస్తే రోజుకు 300 గ్రాముల కెఫైన్ తీసుకునేవారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తక్కువని వర్సిటీ సైంటిస్టులు తెలిపారు. కాగా, ఈ స్టడీ ఫలితాలను క్లినికల్ ఎండోక్రైనాలజీ, మెటబాలిజం జర్నల్ ప్రచురించింది.
Recent research has revealed that those who drink three cups of coffee or tea a day have a reduced risk of diseases that cause heart disease, including diabetes. Caffeine in coffee and tea has been shown to strengthen the heart. 200 to 300 milligrams of caffeine enters the body with three cups of coffee.
Scientists from China's Shuzhou Medical College, Suzhou University, said that if you take a total of 300 milligrams per day of caffeine-containing products (chocolates, energy drinks, and snack bars), the risk of heart disease will be reduced by 40 to 48 percent.
To this extent, details of lakhs of people have been collected from UCO Biobank data and this matter has been identified. In this, 1.72 lakh volunteers tested coffee drinkers and 1.88 lakh people drank both coffee and tea. Those who did not consume caffeine, compared to those who consumed only one hundred milligrams per day University scientists said that those who consume 300 grams of caffeine per day have a lower risk of heart disease. Meanwhile, the results of this study were published in the Journal of Clinical Endocrinology and Metabolism.
మరిన్ని వార్తల కోసం....
* మొబైల్స్ మన మాటలు వింటాయా ఇక్కడ క్లిక్ చేయండి
* అమ్మో ఇంత పెద్ద కుట్రనా పేలుళ్లకు పేజర్లనే వాడటానికి కారణం ఇదా ఇక్కడ క్లిక్ చేయండి
* మీ పిల్లలు స్మార్ట్ వాచ్ వాడుతున్నారా కిడ్నాప్ అయ్యే అవకాశం జాగ్రత్త పేరంట్స్ ఇక్కడ క్లిక్ చేయండి
* రైతుల రక్తంలో పెస్టిసైడ్స్ విషం రక్తం మూత్రంలో 28 రకాల పురుగు మందుల అవశేషాలు ఇక్కడ క్లిక్ చేయండి