Type Here to Get Search Results !

Sports Ad

అమ్మో ఇంత పెద్ద కుట్రనా పేలుళ్లకు పేజర్లనే వాడటానికి కారణం ఇదా Um, This Is The Reason Why Pagers Are Used For Such Big Conspiracies

అమ్మో ఇంత పెద్ద కుట్రనా పేలుళ్లకు పేజర్లనే వాడటానికి కారణం ఇదా

జాతీయ National News భారత్ ప్రతినిధి : ఇందులో ‘ఏఆర్924’ మోడల్​కు చెందిన పేజర్లు 3000 వరకు ఉన్నట్టు పేర్కొన్నది. పేజర్ డివైస్ లో బ్యాటరీ కింది భాగంలో పేలుడు పదార్థాన్ని అమర్చి, ఒక స్విచ్ కూడా అమర్చారని సమాచారం. ఈ స్విచ్ ద్వారా రిమోట్ కంట్రోల్తో పేజర్ను పేల్చేసినట్లు తెలిసింది. పేజర్లో 90 గ్రాముల పరిమాణంలో రీఛార్జబుల్ లిథియం బ్యాటరీ ఉంది. ఈ పేజర్ డివైజ్కు హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థ సభ్యులు ఒక మెసేజ్ పంపగానే పేజర్లు పేలిపోయాయి. ఆ మెసేజ్ వచ్చిన కొన్ని సెకన్ల పాటు పేజర్ బీప్ శబ్దం చేస్తుంది. ఆ తర్వాతే పేలిపోతుంది.

అసలు పేజర్ అంటే....
మొబైల్ ఫోన్లు అందుబాటులోకి రాకముందు అత్యవసర సందేశాలు పంపుకునేందుకు వినియోగించిన ఒక చిన్న సైజ్ వైర్లెస్ డివైజే ఈ పేజర్. వాయిస్ కాల్స్ చేయలేం కానీ టెక్ట్స్ మెసేజెస్ను ఈ పేజర్ డివైజ్ చేరవేస్తుంది. 1980, 90ల్లో ఈ పేజర్ డివైజ్ మోస్ట్ పాపులర్. మొబైల్ ఫోన్లు వచ్చాక ఈ పేజర్లు రానురానూ కనుమరుగైపోయాయి. ఈ డివైజ్లను తయారు చేసే కంపెనీలు కూడా ఉత్పత్తిని నిలిపివేశాయి. 

 ఇంత టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన ఈరోజుల్లో కూడా హెజ్బొల్లా మిలిటెంట్లు ఈ పేజర్లనే ఎందుకు వాడారంటే పేజర్లయితే మొబైల్ ఫోన్ల మాదిరిగా లొకేషన్ను ట్రాక్ చేయలేరు. పేలుళ్లకు మొబైల్ ఫోన్లు వినియోగిస్తే ఏం జరుగుతుందో హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూప్కు బాగా తెలుసు. గత ఫిబ్రవరిలో ఈ గ్రూప్ జనరల్ సెక్రటరీ హసన్ నస్రల్లా తన గ్రూప్ సభ్యులను ఈ మేరకు హెచ్చరించాడు కూడా. ఇజ్రాయెల్ నిఘా వ్యవస్థ కంటే ఫోన్లే తమకు ప్రమాదకరమని.. ఫోన్లను పగలగొట్టాలని లేదా ఐరన్ బాక్స్లో పెట్టి లాక్ చేయాలని మిలిటెంట్ గ్రూప్ సభ్యులను హసన్ నస్రల్లా హెచ్చరించాడు.

It is stated that there are up to 3000 pagers of 'AR924' model. In the pager device, an explosive device was placed under the battery and a switch was also installed. This switch is known to detonate a pager with a remote control. 

 Pager has a 90 gram rechargeable lithium battery. When members of the Hezbollah militant group sent a message to this pager device, the pagers exploded. The pager will beep for a few seconds after receiving the message. Then it explodes.

మరిన్ని వార్తల కోసం....  
* మొబైల్స్​​ మన మాటలు వింటాయా ఇక్కడ క్లిక్ చేయండి
* ఈ విషయం తెలిస్తే రోజుకు 3 కప్పుల కాఫీ కచ్చితంగా తాగుతారేమో ఇక్కడ క్లిక్ చేయండి
* మీ పిల్ల‌లు స్మార్ట్ వాచ్ వాడుతున్నారా కిడ్నాప్ అయ్యే అవ‌కాశం జాగ్ర‌త్త పేరంట్స్ ఇక్కడ క్లిక్ చేయండి
* రైతుల రక్తంలో పెస్టిసైడ్స్ విషం రక్తం మూత్రంలో 28 రకాల పురుగు మందుల అవశేషాలు ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies