Type Here to Get Search Results !

Sports Ad

మీకు మతిమరుపు ఉంటే ఇలా చేయండి Do This If You Are Forgetful

మీకు మతిమరుపు ఉంటే ఇలా చేయండి

Health News భారత్ ప్రతినిధి : మతిమరుపు దశల్ని గుర్తించేందుకు ప్రస్తుతం కళ్లు స్కాన్ చేయడం, రక్తపరీక్షలు, కనుపాప ట్రాకింగ్ యాప్స్, వాసనకు సంబంధించిన పరీక్షలు వంటివి చేస్తున్నారు. అయితే మూత్రంలోని ఫార్మిక్ యాసిడ్ శాతాన్ని బట్టి కూడా అల్జీమర్స్ తొలిదశను గుర్తించొచ్చట ఇది తక్కువగా ఉంటే మెదడు ఆరోగ్యంగా ఉంటుందని చెప్తున్నారు.

 ఎక్కువ శాతంలో ఉంటే హానికరమట. ఇందుకోసం కొందర్ని ఎంపిక చేసి, ఫార్మిక్ యాసిడ్ శాతాన్ని బట్టి వాళ్లని నాలుగు విభాగాలుగా చేశారు. వాళ్ల జ్ఞాపకశక్తిని పరిశీలిస్తే.. అందులో ఈ ఆమ్లం తక్కువ శాతంలో ఉన్నవాళ్లలో మతిమరుపు తక్కువగా ఉందట. దీన్నిబట్టి అల్జీమర్స్​ను మొదటి దశలోనే గుర్తిస్తే ట్రీట్​మెంట్ ఈజీ అవుతుందని ‘ఫ్రాంటియర్ ఇన్ ఏజింగ్ న్యూరోసైన్స్’ పత్రిక పేర్కొంది. 

సంగీతం....
మ్యూజిక్ వల్ల డిమెన్షియా వ్యక్తులు తిరిగి జ్ఞాపకాలను నెమరువేసుకోగలరని తెలుస్తోంది. సొంతవాళ్లను గుర్తుపట్టలేకపోయినా, వాళ్లను తెలిసిన ట్యూన్స్​ని పియానో లేదా వయొలిన్​లో వాయించగలుగుతారు. ఈ విషయంపై ఈ మధ్య జరిగిన ఒక స్టడీలో మ్యూజికల్ యాక్టివిటీలు ఎక్కువగా చేయడం వల్ల బ్రెయిన్​లోని కొన్ని ఏరియాల్లో గ్రే మ్యాటర్ పెరుగుతుంది.

పుదీనా వాసనతో...
మెంథాల్ (పుదీనా) వాసన చూడడం వల్ల అల్జీమర్స్ వ్యాధి లక్షణాల నుంచి రిలీఫ్​ ఉంటుందని మరో స్టడీలో వెల్లడైంది. అల్జీమర్స్ అనేది నాడీ వ్యవస్థ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి మెంథాల్ వాసన పదేపదే చూస్తే మార్పు కనిపిస్తుందని అంటున్నారు. ఇందుకోసం అల్జీమర్స్ లక్షణాలు ఉన్న ఎలుకలను జన్యుమార్పిడి పద్ధతిలో రూపొందించారు. 

అల్జీమర్స్ డే....
జర్మనీకి చెందిన ఫిజీషియన్ అయిన అలోయిస్ అల్జైమర్​ పేరు నుంచి ‘అల్జీమర్’ అనే పదం వచ్చింది. అలోయిస్ ఒక కేసును పరిశీలిస్తున్నప్పుడు ఆమె బ్రెయిన్​లో వచ్చిన మార్పులను గుర్తించాడు. దాన్ని ‘అసాధారణమైన వ్యాధి​’గా 1906లో  గుర్తించాడు. ఆయన1915లో చనిపోయారు. దాంతో ఆ కేసును ఛేదించేందుకు అంతర్జాతీయం​గా రీసెర్చ్​లు మొదలయ్యాయి. 

అంచెలంచెలుగా ప్రభావం....
‘ఎపిసోడిక్ మెమరీలాస్’ అంటే ఒక్కొక్కటిగా తెలిసిన విషయం, పని మర్చిపోవడం. పొద్దున్న ఏం తిన్నారో గుర్తుండదు. ఒకే విషయాన్ని పదే పదే అడుగుతుంటారు. అల్జీమర్స్ ముదిరేకొద్దీ వస్తువుల పేర్లు కూడా గుర్తుండవు. ఈ కండిషన్​ని ‘అనోమియా’ అంటారు. రెగ్యులర్​గా, ఇష్టంగా చేసే పనులు ఉదాహరణకు టీవీ చూడడం, పేపర్ చదవడం, వాకింగ్​కి వెళ్లడం వంటివాటి మీద కూడా ఇంట్రెస్ట్ పోతుంది. 

గుర్తుంచుకోవాల్సినవి....       
ఫ్యామిలీ మెంబర్స్​కి ఉంటే మిగతా వాళ్లకు రాదు. డిమెన్షియా జన్యుపరంగా సంక్రమించే వ్యాధి కాదు. వయసు పైబడినప్పుడు డిమెన్షియా లక్షణాలు కనిపిస్తాయి. 65 ఏండ్ల కంటే ముందే అల్జీమర్స్ డెవలప్ అయితే తద్వారా జన్యుపరంగా వచ్చే రిస్క్ ఉండొచ్చు. ఇప్పటివరకు అయితే డిమెన్షియా కేసులన్నీ అల్జీమర్స్ వ్యాధి వల్ల వచ్చినవే ఎక్కువగా ఉన్నాయి. అంటే డిమెన్షియా అనేది వారసత్వం కాదు. 

యాప్స్​లో కొన్ని ఇవి....
స్మార్ట్​ ఫోన్​ చాలా అవసరాలకు ఉపయోగపడుతోంది. డైలీ లైఫ్​లో ప్రతి అవసరానికి యాప్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే డిమెన్షియా పేషెంట్లకు సాయం చేసేందుకు కూడా కొన్ని యాప్స్ ఉన్నాయి. ఆండ్రాయిడ్, ఐఫోన్స్​లో పనిచేసే ఆ యాప్స్​లో కొన్నింటి గురించి.

Eye scans, blood tests, iris tracking apps and smell tests are currently being used to detect the stages of dementia. But it is said that the first stage of Alzheimer's can be detected by the percentage of formic acid in the urine, if it is low, the brain is healthy.

 If it is in high percentage it is harmful. For this, some were selected and divided into four categories based on the percentage of formic acid. If we look at their memory.. those who have less percentage of this acid have less forgetfulness. Due to this, if Alzheimer's is detected in the first stage, the treatment becomes easy.

మరిన్ని వార్తల కోసం.... 
* ఆ పురాతన దేవాలయంలో పెళ్లి చేసుకున్న సిద్దార్థ్ అదితిరావు హైదరీ ఇక్కడ క్లిక్ చేయండి
* మీ పిల్లలు ఇవి తింటే ఇక అంతే సంగతులు బీ కేర్ ఫుల్ ఇక్కడ క్లిక్ చేయండి
* వీటిని ఇలా తీసుకుంటే అలసట దూరం నిద్ర కూడా బాగా పడుతుంది ఇక్కడ క్లిక్ చేయండి 
* పవర్ అంటే ఇదీ కోహ్లీ సిక్స్ కొడితే చెపాక్ స్టేడియం గోడ బద్ధలయింది ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies