Type Here to Get Search Results !

Sports Ad

ఏసీలోనే ఉంటున్నారా ఎన్ని వ్యాధులు వస్తాయో తెలుసా Do You Know How Many Diseases You Get If You Stay In AC

ఏసీలోనే ఉంటున్నారా ఎన్ని వ్యాధులు వస్తాయో తెలుసా

Health News భారత్ ప్రతినిధి : ఏసీకి అలవాటు పడితే కూడా చాలా రకాల వ్యాధుల బారిన పడాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  ఆ తర్వాత చాలా పెద్ద సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. అయితే ఏసీ వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసుకుందాం. బయట ఎంత వర్షం పడుతున్నా కొంతమంది ఏసీ లేకుండా ఉండలేరు అలాంటి వారు వారే కాదు తోటి వారిని కూడా ఇబ్బంది పెడుతుంటారు. వారు పట్టిన కుందేలుకు మూడే కాళ్లు మాదిరిగా మూర్ఖంగా వ్యవవహరిస్తూ తోటి వారి గురించి అసలు పట్టించుకోరు.

 ఏసీని వాడకుండా అస్సలు ఉండలేరు. ఏసీలు, కూలర్లు వాడుతూ ఇంట్లో సేద తీరుతున్నామని అనుకుంటారు అయితే ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు పడతారు. అయితే ముఖ్యంగా ప్రతీ ఆఫీసు, ఇళ్లలో ఏసీలు ఎక్కువగా ఉంటాయి.  అవసరానికి అనుగుణంగా వాడుకోవాలి.  అంతేకాని ఉన్నది కదా అతిగా వాడితే ఇబ్బందులు పడతారు.

ఎయిర్ కండీషనర్ దుష్ప్రభావాలు : ఎయిర్ కండీషనర్ నుండి వచ్చే గాలి మన ఆరోగ్యానికి మాత్రమే హాని కలిగిస్తుందని కొందరు అనుకుంటారు. అయితే ఇది మన చర్మాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అటువంటి పరిస్థితిలో ఎయిర్ కండీషనర్కు బదులుగా కొన్ని సహజ వస్తువులను ఉపయోగించాలి.

ఉబ్బసం : ఎయిర్ కండీషనర్ నుండి వచ్చే గాలి ఆస్తమాని ప్రేరేపిస్తుంది. అంతేకాదు శ్వాసకోశ వ్యాధులకు కూడా కారణమవుతుంది. ఆస్తమా పేషెంట్ అయితే, ఏసీ గాలికి దూరంగా ఉండాలి లేదా పరిమితంగా వాడాలి. పరిమిత సమయం వరకు ఎయిర్ కండీషనర్‌ను ఉంచాలి. సాధ్యమైతే సహజ పద్ధతులను ఉపయోగించాలి.

నిర్జలీకరణ : అత్యంత ప్రమాదకరమైన సమస్య డీహైడ్రేషన్. అటువంటి పరిస్థితిలో, తగినంత నీరు త్రాగడానికి సలహా ఇస్తారు. కానీ నిరంతరం ఏసీలో కూర్చోవడం కూడా ఈ సమస్యను కలిగిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువ సేపు ఏసీలో కూర్చోవడం మానుకోండి.

అలెర్జీ రినైటిస్ : ఏసీలో ఎక్కువ సమయం గడపడం కూడా అలర్జిక్ రినైటిస్‌కి ప్రధాన కారణం అవుతుంది. ఎక్కువసేపు ఏసీలో కూర్చోకుండా ఉండటానికి ప్రయత్నించండి.

మెదడు సమస్యలు : AC గాలి వలన  మెదడు కణాలు బలహీనపడతాయి. దీని కారణంగా మెదడు సామర్థ్యం, పనితీరు దెబ్బతింటుంది. ఇది మాత్రమే కాదు, మీరు తలనొప్పితో పాటు నిరంతరం మైకంతో బాధపడవచ్చు.

కీళ్ల నొప్పులు : ఏసీ గాలి వల్ల బాడీ పెయిన్‌తో పాటు కీళ్ల నొప్పులు కూడా వస్తాయి. చల్లటి గాలి శరీర నొప్పులు, కీళ్ళు, వెన్ను నొప్పికి కారణమవుతుంది. ఒక అధ్యయనం ప్రకారం, కీళ్ల నొప్పులతో బాధపడేవారు ఏసీలో ఉంటే నొప్పుల సమస్య పెరుగుతుంది.

Experts warn that even if you get used to AC, you will be affected by many types of diseases.  It is said that there will be many big problems to face after that. But let's know what are the problems caused by AC. No matter how much it is raining outside, some people cannot live without AC and such people not only cause trouble to themselves but also to others. They act foolishly like a caught rabbit with three legs and do not really care about their fellow man.

 Can't live without using AC. They think that they are living at home by using ACs and coolers, but they face a lot of health problems. But especially in every office and house there are more ACs.  Use as needed.  Moreover, if you use it too much, you will have problems.

మరిన్ని వార్తల కోసం.... 
* వర్షాకాలంలో మీ పాదాలను ఇలా రక్షించుకోండి ఇక్కడ క్లిక్ చేయండి
* చెల్లి పెళ్లిలో డ్యాన్స్తో దుమ్మురేపిన సాయి పల్లవి ఇక్కడ క్లిక్ చేయండి
* లోన్ యాప్ వేధింపులకు హైదరాబాద్ కుర్రోడు ఆత్మహత్య ఇక్కడ క్లిక్ చేయండి 
* కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​రెడ్డి ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies