Type Here to Get Search Results !

Sports Ad

మెట్రో నుంచి మున్సిపాలిటీల దాకా అంతా కేసీఆర్ చెప్పినోళ్లకే Everything From Metro To Municipalities Is According To KCR

మెట్రో నుంచి మున్సిపాలిటీల దాకా అంతా కేసీఆర్ చెప్పినోళ్లకే

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు మిషన్​ కాకతీయ, మిషన్​ భగీరథ, అంబేద్కర్​ విగ్రహం, కలెక్టరేట్లు, సెక్రటేరియెట్​ నిర్మాణం దాకా అన్నిట్లో గత బీఆర్​ఎస్​ సర్కార్​ మొదట తక్కువ ధరకు కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి ఆ తర్వాత అమాంతం అంచనా వ్యయాన్ని పెంచేసినట్లు ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది. 

 మొదట్లో టెండర్​ దాఖలు చేసే టైమ్​లో అంచనాలు తక్కువకు చూపడం ఆ తర్వాత మధ్యలో వాటిని సవరించడం పూర్తయ్యే సరికి ఖర్చు రెండు మూడింతలు కావడం వంటివి ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. కమీషన్ల కోసమే కొన్ని పనుల అంచనా వ్యయాన్ని డబుల్​, ట్రిపుల్​ చేసినట్లు తేలింది. అయినవాళ్లకు కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు రూల్స్​ను కూడా గత పాలకులు బ్రేక్​ చేసినట్లు ప్రస్తుత సర్కార్​ గుర్తించింది.

 ఇటీవల ఐటీ, ఇండస్ట్రీస్​ డిపార్ట్​మెంట్​పై రివ్యూలోనూ కొన్ని కంపెనీలకు గత సర్కార్​ ప్రత్యేకంగా ఇచ్చిన ఇన్సెంటివ్​లు, భూముల కేటాయింపుల్లోనూ అక్రమాలు జరిగినట్లు సీఎం రేవంత్​ గుర్తించారు రాయదుర్గం(మైండ్​ స్పేస్) నుంచి శంషాబాద్ ఎయిర్​పోర్టు వరకు 31 కిలోమీటర్ల మెట్రో కొత్త రూట్​కు గత ప్రభుత్వం శంకుస్థాపన చేసింది.

 ఆ ప్రాజెక్ట్ డీపీఆర్​లో  రూ.4,650 కోట్లు అవుతుందని అంచనా వేశారు. అయితే ఈ రూట్​ శంకుస్థాపనకు వచ్చేసరికి ఏకంగా రూ. 1,600 కోట్లు అంచనా వ్యయం పెరిగింది. దీని మొత్తం అంచనా వ్యయం రూ.6,250 కోట్లుగా చూపారు. అసలు సంబంధం లేని రూట్​ను ఎంచుకోవడం ఏమిటి ఆ ప్రపోజల్స్​ అంతకు పెంచడం ఏమిటి ఎవరికి కమీషన్లు పెంచేందుకు ఇట్ల చేశారు అన్న విమర్శలు మొదటి నుంచి ఉన్నాయి.

Starting from Kaleshwaram project, Mission Kakatiya, Mission Bhagiratha, Ambedkar statue, Collectorates, Secretariat construction, the previous BRS government first handed over the works to the contractors at a low price and then the current government found that the estimated cost was increased by a lot.

 At the time of filing the tender, the estimates were initially underestimated, and then when the revisions were completed, the cost became two-thirds of the cost. It has been found that the estimated cost of some works has been doubled or tripled just for commissions. The previous rulers also made rules to bind the contracts to the people

 Recently, in the review of the IT and Industries Department, CM Revanth found that there were irregularities in the incentives given to some companies by the previous government and in the allotment of land. Govt laid foundation stone.

 It is estimated that the project will cost Rs 4,650 crore in DPR. But when this route comes to the foundation stone, a sum of Rs. 1,600 crores increase in estimated cost. Its total estimated cost is Rs 6,250 crore. What is the purpose of choosing a route that is not related to the original, what is the purpose of increasing the proposals, to whom this has been done to increase the commissions.

మరిన్ని వార్తల కోసం....  
* గద్వాల జిల్లాలో 1,800 ఎకరాల్లో పంట నష్టం ఇక్కడ క్లిక్ చేయండి
* రోహిత్ బెయిల్-స్విచ్ ట్రిక్‌ ఫలించని ప్రయోగం ఇక్కడ క్లిక్ చేయండి
* కేసీఆర్ హయాంలో సెక్రటేరియెట్ అట్లా కలెక్టరేట్లు ఇట్లా ఇక్కడ క్లిక్ చేయండి
* గిన్నిస్ రికార్డుకు చిరంజీవికి ప్రత్యేక అనుబంధం ఆ ఆసక్తికర విషయాలేంటో ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies