గిన్నిస్ రికార్డుకు చిరంజీవికి ప్రత్యేక అనుబంధం ఆ ఆసక్తికర విషయాలేంటో చూడండి
జాతీయ National News భారత్ ప్రతినిధి : మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) కి గిన్నిస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డ్(Guinness World Records)లో చోటు దక్కిన విషయం తెలిసిందే. 156 సినిమాలు,537 పాటలు, 24 వేల స్టెప్పులతో అలరించినందుకు చిరంజీవికి ఈ రికార్డ్ దక్కింది. టాలీవుడ్‌తో పాటు భారత సినీ చరిత్రలో తన ఆట, పాట, యాక్షన్‌తో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఆదివారం (సెప్టెంబర్ 22న) చోటు దక్కించుకున్నారు చిరంజీవి.
అయితే, ఇక్కడ మరోక ఆసక్తికర విషయం కూడా చోటుచేసుకుంది. అదేంటంటే 1955 లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ స్థాపించి మొదట పబ్లిష్ జరిగింది ఆగస్టులోనే. అంతేకాకుండా చిరంజీవి కూడా అదే సంవత్సరం 1955 ఆగస్టులోనే పుట్టడం విశేషం. అలాగే మరొక విశేషం కూడా ఉన్నది 22 సెప్టెంబర్ 1978 లో తన మొదటి సినిమా ప్రాణం ఖరీదు రిలీజయిన డేట్ కూడా ఇదే కావడం గమనార్హం.
గిన్నిస్ రికార్డ్ మొదలు పెట్టిన సంవత్సరం, అదే నెలలో చిరంజీవి పుట్టడం, తన మొదటి సినిమా రిలీజయిన డేట్ కి 46 ఏళ్ళ తర్వాత గిన్నిస్ రికార్డ్ అందుకోవడం ఇలా అనుకోకుండా గిన్నిస్ రికార్డుకు మెగాస్టార్ చిరంజీవికి ఏదో అనుబంధం ఉందంటూ మెగా ఫ్యాన్స్, నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇకపోతే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్న మెగాస్టార్ చిరంజీవికి సినీ,రాజకీయ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
It is known that Megastar Chiranjeevi has got a place in the Guinness Book of World Records. Chiranjeevi got this record for entertaining with 156 movies, 537 songs and 24 thousand steps. Guinness Book of World for creating a special image for himself with his acting, song and action in the history of Indian cinema along with Tollywood.
However, another interesting thing happened here. That is, the Guinness World Record was established in 1955 and first published in August. Moreover, Chiranjeevi was also born in August 1955 of the same year. Also there is another feature which is 22nd September 1978 which is also the date of release of his first movie Pranam Kharidu.
Mega fans and netizens are posting on social media that Chiranjeevi was born in the same month as the Guinness record, and that he received the Guinness record 46 years after the release date of his first film. Otherwise Guinness Book of World.