Type Here to Get Search Results !

Sports Ad

రోహిత్ బెయిల్ స్విచ్ ట్రిక్‌ ఫలించని ప్రయోగం Rohit's Bail Switch Trick Was A Futile Experiment

రోహిత్ బెయిల్-స్విచ్ ట్రిక్‌ ఫలించని ప్రయోగం

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : చెన్నై వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బెయిల్-స్విచ్ ట్రిక్‌ ఉపయోగించాడు. వికెట్ రాని సమయంలో ఫీల్డింగ్ టీం ఈ ట్రిక్ ఉపయోగిస్తే వికెట్ పడుతుందనే సెంటిమెంట్ ఉంది. బెయిల్-స్విచ్ అంటే స్టంప్స్ మీద ఉన్న రెండు బెయిల్స్ మారుస్తారు. కొన్ని సందర్భాల్లో ఇది ఫలించడంతో ఈ ట్రిక్ బాగా ఫేమస్ అయింది. తాజాగా రోహిత్ ఈ  బెయిల్-స్విచ్ ట్రిక్‌ సెంటిమెంట్ ఫాలో అయ్యాడు.

 నాలుగో రోజు ఆటలో భాగంగా బంగ్లాదేశ్ కెప్టెన్ శాంటో షకీబ్ అల్ హసన్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 12 ఓవర్ల పాటు భారత బౌలర్లకు వికెట్ ఇవ్వలేదు. ఈ క్రమంలో రోహిత్ బౌలింగ్ ఎండ్ వద్ద బెయిల్స్ ను మార్చాడు. అయితే అనుకున్న ఫలితం మాత్రం ఇవ్వలేదు. ఈ ట్రిక్ ను తొలిసారి ఇంగ్లాండ్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ ప్రయోగించగా ఇది విజయవంతమైంది. బెయిల్స్ ను మార్చిన తర్వాత ఓవర్లో మార్క్ వుడ్ బౌలింగ్ లో ఆస్ట్రేలియా ఆటగాడు మార్నస్ లబుషేన్ రూట్ కు స్లిప్ లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.   

 రోహిత్ ఆశించినట్టు వెంటనే వికెట్ పడకపోయినా 48 పరుగుల వద్ద వీరిద్దరి భాగస్వామ్యానికి తెర పడింది. ఆ తర్వాత చివర్లో జడేజా చక చక వికెట్లు తీస్తూ బంగ్లా లోయర్ ఆర్డర్ ను పెవిలియన్ కు పంపాడు. దీంతో భారత్ తొలి టెస్టులో 280 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ లో విఫలమైన రోహిత్ కెప్టెన్ గా తన జైత్రయాత్రను కొనసాగిస్తున్నాడు. కెప్టెన్సీ చేపట్టిన తర్వాత ఇప్పటివరకు ఒక్క సిరీస్ కూడా ఓడిపోని కెప్టెన్ గా దూసుకెళ్తున్నాడు.

Team India captain Rohit Sharma used the bail-switch trick in the first Test against Bangladesh at Chennai. There is a sentiment that if the fielding team uses this trick when there is no wicket, the wicket will fall. A bail-switch is where the two bails on the stumps are exchanged.

 As part of the fourth day of play, Bangladesh captain Santo Shakib Al Hasan established a partnership. Indian bowlers were not given a wicket for 12 overs. In this sequence, Rohit changed the bails at the bowling end. But the desired result was not given. England's legendary fast bowler did this trick for the first time.

Although Rohit did not get a wicket immediately as expected, the partnership between the two ended at 48 runs. After that, Jadeja took wickets each and sent the lower order of Bengal to the pavilion. India won the first test by a huge margin of 280 runs.

మరిన్ని వార్తల కోసం....  
* గద్వాల జిల్లాలో 1,800 ఎకరాల్లో పంట నష్టం ఇక్కడ క్లిక్ చేయండి
* కేసీఆర్ హయాంలో సెక్రటేరియెట్ అట్లా కలెక్టరేట్లు ఇట్లా ఇక్కడ క్లిక్ చేయండి
* మెట్రో నుంచి మున్సిపాలిటీల దాకా అంతా కేసీఆర్ చెప్పినోళ్లకే ఇక్కడ క్లిక్ చేయండి
* గిన్నిస్ రికార్డుకు చిరంజీవికి ప్రత్యేక అనుబంధం ఆ ఆసక్తికర విషయాలేంటో ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies