Type Here to Get Search Results !

Sports Ad

సెంచరీలతో దంచి కొట్టిన గిల్, పంత్ బంగ్లాదేశ్ టార్గెట్ ఎంతంటే Gill, Who Hit with Centuries, Pant Is The Target Of Bangladesh

సెంచరీలతో దంచి కొట్టిన గిల్, పంత్ బంగ్లాదేశ్ టార్గెట్ ఎంతంటే

జాతీయ National News భారత్ ప్రతినిధి : చెన్నై టెస్టులో భారత్ దూసుకెళ్తుంది. ఏకంగా 514 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. గిల్, పంత్ సెంచరీలతో బంగ్లాదేశ్ ముందు 515 పరుగుల భారీ టార్గెట్ ను నిర్ధేశించింది. గిల్ సెంచరీ చేసిన కాసేపటికే రెండో ఇన్నింగ్స్ 4 వికెట్ల నష్టానికి 287 పరుగుల వద్ద  భారత్ ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. గిల్ (119) రాహుల్ (22)  నాటౌట్ గా నిలిచారు.  

 మూడో రోజు ఆటలో పంత్, గిల్ ఆట హైలెట్ గా నిలిచింది. మొదట పంత్ సెంచరీ మార్క్ అందుకోగా ఆ తర్వాత అతనితో పాటు మరో ఎండ్ లో గిల్ సైతం తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో డకౌటైన గిల్ రెండో ఇన్నింగ్స్ లో సెంచరీతో సత్తా చాటాడు. 155 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న గిల్ ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు 3 సిక్సర్లున్నాయి. గిల్ టెస్ట్ కెరీర్ లో ఇది ఐదో సెంచరీ.

 అంతకముందు పంత్ 124 బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మూడో రోజు ఆటలో భాగంగా లంచ్ తర్వాత పంత్ ఈ తన సెంచరీ మార్క్ అందుకున్నాడు. పంత్ ఇన్నింగ్స్ లో 11 ఫోర్లు.. 4 సిక్సర్లున్నాయి. టెస్ట్ కెరీర్ లో ఇది రిషబ్ కు ఇది ఆరో సెంచరీ. సెంచరీ తర్వాత పంత్ ఔట్ అయ్యాడు. భారత్ తమ తొలి ఇన్నింగ్స్ లో 376 పరుగులకు ఆలౌటైంది. బంగ్లాదేశ్ తమ తొలి ఇన్నింగ్స్ లో కేవలం 149 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్ కు తొలి ఇన్నింగ్స్ లో 227 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.

India will advance in the Chennai Test. Together they got a lead of 514 runs. Bangladesh set a huge target of 515 runs with Gill and Pant centuries. Shortly after Gill's century, India declared the innings at 287 for 4 in the second innings. Gill (119) and Rahul (22) remained not out.

 Pant and Gill's play was the highlight of the third day's play. First Pant got the century mark and then Gill also completed his century along with him at the other end. Gill, who was a dacoit in the first innings, showed his strength with a century in the second innings. Gill completed his century in 155 balls with 9 fours and 3 sixes in his innings.

 Earlier, Pant completed his century in 124 balls. Pant got his century mark after lunch on the third day of play. There are 11 fours and 4 sixes in Pant's innings. This is Rishabh's sixth century in Test career. Pant was out after the century. India were bowled out for 376 runs in their first innings.

మరిన్ని వార్తల కోసం....  
* తేనెటీగ విషంతో గంటలో క్యాన్సర్ ఖతం ఇక్కడ క్లిక్ చేయండి
* ఏ బ్లడ్ గ్రూప్ వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఇక్కడ క్లిక్ చేయండి
* హైదరాబాద్‌లో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న ముఠా అరెస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి
* ఈ సిగరెట్ వల్ల క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది తాగేవాళ్లకే కాదు పక్కనున్నవాళ్లకు కూడా ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies