ఈ సిగరెట్ వల్ల క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది తాగేవాళ్లకే కాదు పక్కనున్నవాళ్లకు కూడా
జాతీయ National News భారత్ ప్రతినిధి : స్మోకింగ్ ఈజ్ ఇంజురియాస్ టు హెల్త్ ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని సిగరెట్ పెట్టెల మీద, సినిమా హాళ్లలో యాడ్స్ వేస్తున్నా సిగరెట్ తాగేవారి సంఖ్య ఏ మాత్రం తగ్గట్లేదు. సిగరెట్స్ కి తోడుగా ఇప్పుడు ఈ సిగరెట్స్ ట్రెండ్ పెరిగిపోతోంది. ముఖ్యంగా యూత్ వీటికి ఎక్కువగా అలవాటు పడుతున్నారు. ఈ సిగరెట్స్ వల్ల ఆరోగ్యానికి ప్రమాదం ఉండదన్న అపోహ ఒకవైపు, సిగరెట్ లాగా దీన్ని పిలిచినప్పుడు దుర్వాసన ఉండకపోవడంతో యూత్ ఈ సిగరెట్ కి ఎక్కువ అలవాటు పడుతున్నారు. ఈ సిగరెట్ ని వైప్ అని కూడా పిలుస్తారు.
అయితే, ఈ - సిగరెట్ కూడా ఆరోగ్యానికి హానికరం అని చాలా అధ్యయనాల్లో తేలింది. సిగరెట్ వల్ల ఎన్ని అనార్థాలున్నాయో ఈ సిగరెట్ వల్ల కూడా అన్ని అనార్థాలున్నాయని తేలింది. ఈ - సిగరెట్ కి బానిసలవుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్న క్రమంలో ప్రభుత్వం వీటిపై నిషేధం విధించింది.
ఈ-సిగరెట్ల అమ్మకాలపై కేంద్రం నిషేధం విధించటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. క్యాన్సర్ కారక ఎలక్ట్రానిక్ సిగరెట్ అమ్మకాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటు న్నారు.
వీటి అమ్మకాలు ఎక్కువగా జరిగే గ్రేటర్ పై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఎగుమతి, దిగుమ తులు అమ్మణాలపై నిఘా పెట్టారు. సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హోల్ సీల్ వ్యాపారులకు అవగాహన కల్పిస్తున్నారు. సముద్ర తీర ప్రాం తాలైన ముంబయి, గోవా, వెస్ట్ బెంగాల్, చెన్నై నుంచి ఎక్కువగా ఇవి దిగుమతి అవుతున్నాయి. ఏటా సుమారు 1.5 నుంచి వెలక్షల ఈ-సిగరెట్స్ సిటీకి వస్తున్నట్టు తెలుస్తోంది. బేగంబజార్, సిద్ది అంబర్ బజార్, సికింద్రాబాద్ లోని హోల్ సేల్ మార్కెట్ల నుంచి రిటైల్ మార్కెట్ కి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
సిటీ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఒక్కో ఈ-సిగరెట్ ధర రూ.300 నుంచి బ్రాండ్, ఫ్లేవర్స్ ని బట్టి రూ. 1500 దాకా అమ్ముతున్నారు. రీహాబిలిటేషన్ కౌన్సెలింగ్ తో కొంతకాలం వీటిని వాడుతున్నారు. తర్వాత అది వ్యసనంగా మారుతోంది. దీంతో పొగతో పాటు నికోటిన్, ప్రొఫైలైన్, గ్లిజరిన్ వంటి ద్రవ పదార్థాల తో ఎలక్ట్రానిక్ స్మోక్ కి బానిసలవుతున్నారు. క్యాన్సర్ కారకాలు ఎక్కువ ఈ-సిగరెట్ లోని కాట్రిడ్జిలలో డీ ఇథైల్ గ్జికాల్ అనే విషపూరిత పదార్థంతో పాటు నైట్రోజమైన్స్ అనే క్యాన్సర్ కారకాలు ఉంటాయి.
పొగను లోపలికి పీల్చినప్పుడు అది మామూలు సిగరెట్లలాగే పెదాలు, గొంతు, ఊపిరితిత్తులపై ప్రభావాన్ని చూపుతుంది. దీంతో శ్వాసకోశ సంబంధ వ్యాధులతో పాటు దంత వ్యాధుల వస్తున్నాయి. బ్యాటరీ వేడితో ద్రవ పదార్థం స్మోక్ గా మారడం వల్ల ఊపిరితిత్తుల్లో దీర్ఘకాలిక మంట, క్రానిక్ ఇన్ ఫ్లమేషన్ (ఇన్ఫెక్షన్) ఏర్పడుతుంది. అలాంటి ఎలక్ట్రానిక్ డివైజ్ లో ఏర్పడే పొగ పీల్చడం దీర్ఘకాలంగా కొనసాగితే ఎంపసిమా, బ్రాంకైటిస్, గుండెజబ్బుల వంటి వ్యాధులు వస్తాయి.
Smoking is injurious to health Despite advertising on cigarette boxes and cinema halls that smoking is injurious to health, the number of cigarette smokers has not decreased at all. Along with cigarettes, the trend of these cigarettes is increasing now. Especially the youth are getting used to it.
However, many studies have shown that e-cigarettes are also harmful to health. It has been found that this cigarette also has all the harmful effects of cigarettes. As the number of people addicted to e-cigarettes is increasing day by day, the government has banned them. Center bans sale of e-cigarettes.
Most of the sales are taking place in the jurisdiction of City and Cyberabad Police Commissionerates. The price of each e-cigarette ranges from Rs.300 depending on the brand and flavors to Rs. Selling up to 1500. They have been used for some time with rehabilitation counseling. Then it becomes addictive. Along with smoke, liquid like nicotine, profilin, glycerin
When the smoke is inhaled it affects the lips, throat and lungs just like regular cigarettes. This causes dental diseases along with respiratory diseases. Due to the heat of the battery, the liquid material turns into smoke, causing chronic inflammation (infection) in the lungs.