Type Here to Get Search Results !

Sports Ad

హైదరాబాద్‌లో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న ముఠా అరెస్ట్ A Gang Selling Ganja Chocolates Was Arrested In Hyderabad

హైదరాబాద్‌లో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న ముఠా అరెస్ట్

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : ఒరిస్సా నుంచి హ్యాష్ ఆయిల్, బీహార్ నుంచి గంజాయి చాక్లెట్ తీసుకువచ్చి హైదరాబాద్ లో విక్రయిస్తున్న ముఠాలను పట్టుకున్నట్లు రాచకొండ సీపీ సుదీర్ బాబు తెలిపారు. ఇరత రాష్ట్రాల నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ లో విక్రయిస్తున్న వారిని అరెస్ట్ చేశారు. నిందితులు వైజాగ్ నుంచి హ్యాష్ ఆయిల్ తక్కువ రేటుకు తీసుకొచ్చి చిన్న చిన్న ప్యాకెట్లులో ప్యాక్ చేసి హైదరాబాద్ లో ఎక్కువ రేటుకు విక్రయిస్తున్నారు. ఈ ముఠాలో మొత్తం ఐదుగురు నిందితులు ఉన్నారని వారిలో రంజిత్ కుమార్ అనే వ్యక్తి ప్రధాన నిందితుడని పోలీసులు వెల్లడించారు.

 అతను డ్రైవర్ గా ఉంటూ డ్రగ్స్ పెడ్లర్ గా చేస్తున్నాడని తెలిపారు. నిందితుల నుంచి 2.3 కేజీల హ్యాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో 3.8 కేజీల గంజాయి చాక్లెట్లను సీజ్ చేశారు. గంజాయి చాక్లెట్లను గుర్తించడం కష్టం కాబట్టి నిందితులు చాలా తేలిగ్గా వీటిని విక్రయిస్తున్నారని సీపీ సుధీర్ బాబు చెప్పారు. సంతోష్, బీరేందర్ సింగ్ అనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారు బీహర్ కు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.

Rachakonda CP Sudir Babu said that the gangs were caught bringing hash oil from Orissa and ganja chocolate from Bihar and selling them in Hyderabad. Those who brought drugs from other states and sold them in Hyderabad were arrested. The accused brought hash oil from Vizag at a low rate.

 He is said to be a drug peddler while being a driver. 2.3 kg hash oil was seized from the accused. In another case, 3.8 kg of ganja chocolates were seized. CP Sudhir Babu said that the accused were selling the ganja chocolates very easily as it was difficult to identify them. Santosh, Birender Singh.

మరిన్ని వార్తల కోసం....  
* తేనెటీగ విషంతో గంటలో క్యాన్సర్ ఖతం ఇక్కడ క్లిక్ చేయండి
* ఏ బ్లడ్ గ్రూప్ వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఇక్కడ క్లిక్ చేయండి
* సెంచరీలతో దంచి కొట్టిన గిల్, పంత్ బంగ్లాదేశ్ టార్గెట్ ఎంతంటే ఇక్కడ క్లిక్ చేయండి
* ఈ సిగరెట్ వల్ల క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది తాగేవాళ్లకే కాదు పక్కనున్నవాళ్లకు కూడా ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies