సిటీలో భారీ వర్షం హైదరాబాద్ ప్రజలకు ఆమ్రపాలి కీలక సూచన
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో భారీ వర్షాలు కురుస్తోన్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.జోనల్ కమిషనర్లు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలను అలర్ట్ చేసి వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద నిలిచిన వర్షపు నీటిని వెంటనే తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వరద నీరు నిలిచిందని ఎవరూ మ్యాన్ హోల్స్ ఓపెన్ చేయకూడదన్నారు. వరద నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లో వాహనాలు నడపవద్దన్నారు.
వర్షాల నేపథ్యంలో నగరవాసులు ఇంటి వద్ద ఉండాలన్న ఆమ్రపాలి అత్యవసరం ఉంటేనే బయటకు వెళ్లాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏదైనా అత్యవసరమైతే జీహెచ్ఎంసీ హెల్ప్ లైన్ సంప్రదించాలని సూచన చేశారు. కాగా, సోమవారం రాత్రి నగరవ్యాప్తంగా వర్షం కురిసింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట్, ఎస్ఆర్ నగర్, ఖైరతాబాద్, లక్డీకపూల్, దిల్ సుఖ్ నగర్, కొత్తపేట, చైత్యనపురి, ఎల్బీ నగర్, ఉప్పల్, తార్నక, హబ్సిగూడ, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది.
GHMC Commissioner Amrapali has issued important instructions to the officials in the wake of heavy rains in the state capital Hyderabad. Zonal commissioners and officials have been ordered to be vigilant. After alerting the Monsoon emergency teams, the officials were advised to take steps to immediately remove the standing rain water at the water logging points. No one should open manholes because the flood water has stopped. Do not drive vehicles in places where flood water is stored.
In view of the rains, the city dwellers are asked to stay at home. They are advised to go out only in case of emergency. The people of the hinterlands should be alert. In case of any emergency, they should contact the GHMC helpline. Meanwhile, it rained across the city on Monday night. There was heavy rain with thunder, lightning and gusty winds at many places. Banjara Hills, Jubilee Hills, Panjagutta, Ameer Pet, SR Nagar, Khairatabad, Lakdikapool, Dil Sukh Nagar, Kothapeta, Chaityanapuri, LB Nagar, Uppal, Tarnaka, Habsiguda, Kondapur, Madapur, Gachibowli and surrounding areas received rain.