తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్ చంద్రబాబువి ఆధారాలు లేని ఆరోపణలు మాజీ ఎంపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి
జాతీయ National News భారత్ ప్రతినిధి : ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్న తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీ కోసం నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారంటూ సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలు రాజకీయవర్గాలనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులను, హిందువులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది.
ఇప్పటికే ప్రతిపక్ష వైసీపీ ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించగా తాజాగా మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి చంద్రబాబు వ్యాఖ్యలపై సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ పిటీషన్ దాఖలు చేశారు మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి. చంద్రబాబు ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశారని పేర్కొన్నారు సుబ్రహ్మణ్యస్వామి.
మొత్తానికి వైసీపీని టార్గెట్ చేస్తూ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చిలికి చిలికి గాలివానగా మారాయి. ఈ అంశంపై సీబీఐ విచారణ కోరుతూ దేశవ్యాప్తంగా వాదనలు వినిపిస్తున్న క్రమంలో మునుముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అన్నది ఆసక్తి సర్వత్రా నెలకొంది.
The Tirumala Laddu controversy, which is causing a furore in AP politics, has become a topic of discussion across the country. The accusations made by CM Chandrababu that animal fat was used instead of ghee for the preparation of Tirumala Laddu Prasadam during the previous YCP government's regime is not only the politicians but also the devotees of Lord Venkateswara all over the country.
The opposition YCP has already approached the Supreme Court on this issue and recently filed a petition in the Supreme Court against the comments of former MP Subrahmanya Swamy Chandrababu. Former MP Subrahmanyaswamy filed a petition demanding an inquiry into Chandrababu's comments. Chandrababu made allegations without evidence
After all, CM Chandrababu's comments targeting YCP have turned into a storm. In the process of hearing arguments across the country demanding a CBI investigation on this issue, there is interest everywhere to see what kind of developments will take place in the future.
మరిన్ని వార్తల కోసం....
* గుజరాత్ లో ఏకంగా దొంగ నోట్ల ఫ్యాక్టరీనే పెట్టారు ఇక్కడ క్లిక్ చేయండి
* కేరళలో ఇంకా మంకీ ఫాక్స్ ఇన్పెక్షన్ ఉన్నట్లు అనుమానం ఇక్కడ క్లిక్ చేయండి
* చైల్డ్ పోర్నోగ్రఫీ చూసినా కూడా జైలుకే సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇక్కడ క్లిక్ చేయండి
* సీఎం రేవంత్ రెడ్డికి రూ.50 లక్షల చెక్కును అందజేసిన మహేష్ బాబు దంపతులు ఇక్కడ క్లిక్ చేయండి