కులగణన కార్యాచరణ ప్రారంభించండి..!!
* ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుంది సీఎం రేవంత్
* సీఎంను కలిసిన బీసీ కమిషన్ చైర్మన్, మెంబర్స్
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : కులగణన కార్యాచరణను ప్రారంభించాలని బీసీ కమిషన్ చైర్మన్, మెంబర్లకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ప్రభుత్వం అన్నివిధాలా సహకరిస్తుందని, రెండు రోజుల్లో టర్మ్ఆఫ్రెఫరెన్స్ టీవోఆర్ ఇస్తామని తెలిపారు. సెక్రటేరియెట్లో సీఎం రేవంత్ రెడ్డిని బుధవారం బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ తో పాటు మెంబర్లు బాలలక్ష్మి, తిరుమల గిరి సురేందర్, రాపోలు జయప్రకాశ్, కమిషన్ అసిస్టెంట్ సెక్రెటరీ సతీశ్కలిశారు.
రాష్ట్రంలో బీసీ కులగణనకు అనుసరించాల్సిన విధి విధానాలపై ముఖ్యమంత్రితో కమిషన్ చైర్మన్, సభ్యులు చర్చించారు. కులగణన ప్రక్రియ చేపట్టేందుకు అవసరమైన చర్యలపై సమగ్ర అధ్యయనం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.అవసరమైతే ఇతర రాష్ట్రాలకు వెళ్లి అక్కడి విధానాలను పరిశీలించాలని తెలిపారు. కాగా, కమిషన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి సీఎంను మర్యాదగా కలిసినట్టు చైర్మన్ నిరంజన్ తెలిపారు. కులగణన ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సహాయ, సహకారాలు అందిస్తామని సీఎం హామీ ఇచ్చారని చెప్పారు.
CM Revanth Reddy advised the BC Commission chairman and members to start the caste census activity. The government will cooperate in all ways, Term Reference (TOR) has announced in two days.BC Commission Chairman Gopishetty Niranjan along with members Balalakshmi, Tirumala Giri Surender, Rapolu Jayaprakash and Assistant Secretary of the Commission welcomed CM Revanth Reddy at the Secretariat on Wednesday.
The chairman and members of the commission discussed with the Chief Minister the procedures to be followed for the BC census in the state. CM Revanth Reddy suggested that a comprehensive study should be done on the steps required to take up the caste census process.Chairman Niranjan said that he met the CM for the first time after taking charge of the commission. He said that the CM has assured that the government will provide all possible assistance and cooperation to complete the caste census process as soon as possible.