Type Here to Get Search Results !

Sports Ad

మోడీ ఇచ్చిన షాక్: ఒక్కరోజే రూ.14వేలు పెరిగిన తులం బంగారం హైదరాబాద్ రేట్లివే Modi's shock: Gold price in Hyderabad rises by Rs 14,000 in a single day

తెలంగాణ వార్తలు భారత్ ప్రతినిధి : కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండి దిగుమతులపై ఉన్న సుంకాన్ని ఒక్కసారిగా 15 శాతానికి పెంచేయటంతో రిటైల్ మార్కెట్లలో కూడా ఆ హీట్ స్టార్ట్ అయ్యింది. ఒక్క రాత్రిలోనే బంగారం రేటు గ్రాముకు రూ.14వందల వరకూ పెరగటం సామాన్యులను షాక్ కి గురిచేసింది. అంటే 10 గ్రాములకు(తులం) బంగారం రేటు రూ.14వేల వరకూ పెరిగింది. ఇదే క్రమంలో వెండి రేటు కేజీకి రూ.20వేల వరకూ పెరుగుదలను నమోదు చేసింది. అరే రేట్లు ఇలా ఉంటే అసలు గోల్డ్ కొనటం ఎలారా బాబు అంటున్నారు సామాన్యులు.

 పెరిగిన రేట్లకు తోడు జీఎస్టీ, తరుగు, మేకింగ్ ఛార్జీలు అంటూ వ్యాపారులు వేసే అదనపు భారంతో ఇకపై బంగారం కొనటం కష్టమే అంటున్నారు. ఈ క్రమంలో షాపింగ్ చేయాలి అనుకుంటున్న వ్యక్తులు ముందుగా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో పెరిగిన రిటైల్ విక్రయ ధరలను పరిశీలించటం చాలా ముఖ్యం.

 మే 13న బంగారం రేట్లు భారీగా పెరిగాయి. మే 12 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా గ్రాముకు రూ.1391 పెరిగింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.16వేల 789గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.15వేల 390గా కొనసాగుతోంది. 

 బుధవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే మే 13, 2026న కేజీకి రూ.20వేలు పెరిగింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రూ.3లక్షల 100కు చేరుకుని షాక్ ఇచ్చింది. అంటే గ్రాము దాదాపుగా రూ.300 దగ్గర కొనసాగుతుందన్నమాట. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies