Type Here to Get Search Results !

Sports Ad

ఎల్ఐసీ నుంచి 2 సరికొత్త పాలసీలు జూన్ 1 నుంచి అందుబాటులోకి ఫుల్ డీటెయిల్స్ 2 new policies from LIC available from June 1st, full details

భారత్ ప్రతినిధి : ప్రభుత్వ ఇన్సూరెన్స్ సంస్థ LIC దేశీంలోని ఇన్వెస్టర్ల కోసం ఒకేసారి రెండు పాలసీలను అనౌన్స్ చేసింది. ఎల్ఐసీ న్యూ జీవన్ సాథి - సింగిల్ ప్రీమియం, ఎల్ఐసీ న్యూ జీవన్ సాథి - లిమిటెడ్ ప్రీమియం అనే పేర్లతో వీటిని మే 22న అధికారికంగా ప్రకటించింది. తమ కస్టమర్ల సేవింగ్స్ పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేయడానికి, నమ్మకమైన ఆర్థిక రక్షణ కల్పించడానికి ఎల్ఐసీ ఈ రెండు ప్లాన్లను డిజైన్ చేసింది.

 ఈ రెండు స్కీమ్స్ కూడా నాన్-పార్టిసిపేటింగ్, నాన్-లింక్డ్  ఇండివిడ్యువల్ సేవింగ్స్ ప్లాన్స్ కేటగిరీ కిందకు వస్తాయి. అంటే స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గులతో ఈ పాలసీలకు ఎలాంటి సంబంధం ఉండదు. మార్కెట్ రిస్క్ లేకుండా ప్రశాంతంగా ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి, స్థిరమైన సేఫ్ రిటర్న్స్ కోరుకునే వారికి ఈ ప్లాన్లు బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తాయి. భవిష్యత్తు కోసం పొదుపు చేయడంతో పాటు లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉండటం ఈ ప్లాన్స్ ప్రత్యేకత.

 పాలసీదారుల వ్యక్తిగత ఆదాయ వనరులు, క్యాష్ ఫ్లో అవసరాలకు తగినట్లుగా ఎల్ఐసీ ఈ స్కీమ్స్‌లో మంచి ఫ్లెక్సిబిలిటీని ఇచ్చింది. ఒకేసారి పెద్ద మొత్తంలో ప్రీమియం చెల్లించాలనుకునే వారి కోసం 'సింగిల్ ప్రీమియం' ఆప్షన్ అందుబాటులో ఉంది. అలా కాకుండా నిర్ణీత కాల వ్యవధి పాటు తక్కువ మొత్తంలో ప్రీమియం కడుతూ పోవాలనుకునే వారి కోసం 'లిమిటెడ్ ప్రీమియం' ఆప్షన్‌ను తీసుకొచ్చారు. దీనివల్ల కస్టమర్లు తమ ఆర్థిక స్థితికి తగ్గట్టుగా ప్రీమియం చెల్లింపుల విధానాన్ని ఎంచుకునే వీలుంటుంది.

 పూర్తిగా దేశీయ ప్రజల అవసరాలకు అనుగుణంగా రూపొందించిన ఈ రెండు కొత్త సేవింగ్స్ ప్లాన్లు వచ్చే నెల, అంటే జూన్ 01, 2026 నుంచి కొనుగోలు చేయడానికి అందుబాటులోకి రానున్నాయి. నమ్మకమైన ప్రభుత్వ సంస్థలో ఇన్వెస్ట్ చేస్తూ ఫ్యామిలీకి ఫైనాన్షియల్ సేఫ్టీ కల్పించాలనుకునే వారు జూన్ 1 నుంచి తమకు నచ్చిన న్యూ జీవన్ సాథి ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అర్హతల వివరాలు త్వరలోనే ఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచనుంది.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies