Type Here to Get Search Results !

Sports Ad

కొత్త నెలలో పడిపోయిన బంగారం రేట్లు తెలుగు రాష్ట్రాల్లో కేజీ వెండి రేటు ఎంతంటే Gold rates have fallen in the new month. What is the rate of silver per kg in Telugu states?

తెలంగాణ వార్తలు భారత్ ప్రతినిధి : బంగారం రేట్లు గతవారం నాటి పతనం ట్రెండ్ కొనసాగిస్తున్నాయి. అంతర్జాతీయంగా సానుకూల పరిస్థితులు కూడా దీనికి దోహదంగా నిలుస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో కొత్త నెలలో బంగారం, వెండి కొనుగోలు చేయాలని భావిస్తున్న రిటైలర్లు, ఇన్వెస్టర్లు ముందుగా తమ నగరాల్లో తాజా రేట్లను పరిశీలించి ముందుకెళ్లటం చాలా ముఖ్యం.

 జూన్ 1న బంగారం రేట్లు తగ్గాయి. మే 31 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా గ్రాముకు రూ.82 తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 622గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 320గా కొనసాగుతోంది. 

 సోమవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే జూన్ 1, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి రూ.2లక్షల 90వేలుగా ఉంది. అంటే గ్రాము దాదాపుగా రూ.290 విక్రయించబడుతోంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies