Type Here to Get Search Results !

Sports Ad

మళ్ళీ పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలు నాలుగు రోజుల్లో రెండోసారి Petrol, diesel prices hiked again for the second time in four days

తెలంగాణ వార్తలు భారత్ ప్రతినిధి : దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు మళ్ళీ పెరిగాయి. మంగళవారం ( మే 19 ) దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ పై 90 పైసల పెంచింది కేంద్ర ప్రభుత్వం. మే 15న పెట్రోల్, డీజిల్ ధరలు రూ.3 పెంచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హైదరాబాద్ లో రూ.110.89గా ఉన్న పెట్రోల్ ధర రూ.111.79కి, రూ.98.96గా ఉన్న డీజిల్ ధర రూ. 99.86కి చేరింది. నాలుగు రోజుల్లోనే రెండోసారి పెట్రోల్, డీజిల్ పెంచడంతో గగ్గోలు పెడుతున్నారు వాహనదారులు.

 ఇక ఏపీలో రూ.113.03గా ఉన్న  పెట్రోల్ ధర తాజా పెంపుతో 113.93కి చేరగా రూ.99.53గా ఉన్న డీజిల్ ధర తాజా పెంపుతో రూ.100.43కి చేరింది. ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.97.77 నుంచి రూ.98.64కు పెంచగా, డీజిల్ ధర లీటరుకు రూ.90.67 నుంచి ఇప్పుడు రూ.91.58కి చేరింది.

 ముంబైలో పెట్రోల్ ధర 91 పైసలు పెరిగి లీటరుకు రూ. 107.59కి చేరగా, డీజిల్ ధర 94 పైసలు పెరిగి లీటరుకు రూ. 94.08కి చేరింది. .చెన్నైలో పెట్రోల్ ధర 82 పైసలు పెరిగి లీటరుకు రూ. 104.49కి చేరగా, డీజిల్ ధర 86 పైసలు పెరిగి లీటరుకు రూ. 96.11కి చేరింది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies