Type Here to Get Search Results !

Sports Ad

తిరుమల కొండకు ఒక్క రోజులోనే పోటెత్తిన భక్తులు : దర్శనానికి 20 గంటలు Devotees flock to Tirumala hills in a single day; 20 hours for darshan

భారత్ ప్రతినిధి : తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్ మెంట్లు నిండి బయట  శిలాతోరణం వరకు భక్తులు క్యూలైన్‌లో వేచి ఉన్నారు. ఉచిత సర్వదర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతోందని టీటీడీ వెల్లడించింది. ఎస్‌ఎస్‌డీ టోకెన్ భక్తులకు సుమారు 6 గంటలు, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు  4 గంటలు పడుతోంది.

 శుక్రవారం ( నవంబర్​ 27)  శ్రీవారిని 63 వేల 645 మంది భక్తులు దర్శించుకున్నారు.  వీరిలో 28 వేల 29 మంది తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీకి 3 కోట్ల 98 లక్షల రూపాయల ఆదాయం లభించింది. నిన్న ( నవంబర్​ 27) 3 లక్షల 76 వేల లడ్డూలు విక్రయించగా, అన్నప్రసాద వితరణ సంఖ్య 2 లక్షల 31 వేలుగా టిటిడి వెల్లడించింది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies