Type Here to Get Search Results !

Sports Ad

ముంబై ఇండియన్స్‌‌ కెప్టెన్‌‌గా రోహిత్‌‌ మూడేళ్ల తర్వాత సారధ్య బాధ్యతలు Rohit returns to captaincy duties for Mumbai Indians after three years

క్రీడా వార్తలు భారత్ ప్రతినిధి : ఐపీఎల్‌‌ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్‌‌ ఫ్యాన్స్‌‌కు అదిరిపోయే గుడ్‌‌ న్యూస్‌‌. మూడేళ్ల తర్వాత హిట్‌‌మ్యాన్‌‌ రోహిత్‌‌ శర్మ మళ్లీ ముంబై ఇండియన్స్‌‌ జట్టుకు సారథిగా బాధ్యతలు చేపట్టాడు. 2027 సీజన్‌‌ కోసం 39 ఏళ్ల సీనియర్‌‌ ఓపెనర్‌‌ రోహిత్‌‌ను కెప్టెన్‌‌గా నియమిస్తున్నట్లు ఫ్రాంచైజీ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. పేసర్‌‌ అర్ష్‌‌దీప్‌‌ సింగ్‌‌తో జరిగిన ట్రేడ్‌‌ ఒప్పందంలో భాగంగా హార్దిక్‌‌ పాండ్యా పంజాబ్‌‌ కింగ్స్‌‌కు వెళ్లడంతో ముంబై మేనేజ్‌‌మెంట్‌‌ మళ్లీ రోహిత్‌‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. 

 2013లో తొలిసారి ముంబై ఇండియన్స్‌‌ కెప్టెన్సీని అందుకున్న రోహిత్‌‌ తన సారథ్యంలో ఐదు ఐపీఎల్‌‌ టైటిళ్లు (2013, 2015, 2017, 2019, 2020), ఒక చాంపియన్స్‌‌ లీగ్‌‌ టీ20 ట్రోఫీ (2013)ని అందించాడు. అయితే, 2020 తర్వాత ఎంఐ ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోవడంతో 2023 సీజన్‌‌ అనంతరం రోహిత్‌‌ను తప్పించి, హార్దిక్‌‌ పాండ్యను కెప్టెన్‌‌గా నియమించారు. కానీ పాండ్య నేతృత్వంలోనూ జట్టు తలరాత మారలేదు. 2024లో పదో స్థానంలో, 2026లో తొమ్మిదో స్థానంలో నిలిచి నిరాశపరిచింది. 

 2025లో క్వాలిఫయర్‌‌-2 వరకు వెళ్లినా టైటిల్‌‌ గెలవలేకపోయింది. వరుసగా మూడు సీజన్లలో విఫలం కావడంతో పాండ్యాను వదులుకోవాలని నిర్ణయించుకున్న ముంబై గుజరాత్‌‌, కోల్‌‌కతా, చెన్నై జట్లతో చర్చలు జరిపి, చివరకు పంజాబ్‌‌తో ట్రేడ్‌‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఐపీఎల్‌‌లో ఇప్పటివరకు 281 మ్యాచ్‌‌లాడిన రోహిత్‌‌ 7,329 పరుగులతో (2 సెంచరీలు, 49 అర్ధసెంచరీలు) అత్యధిక పరుగుల వీరుల జాబితాలో విరాట్‌‌ కోహ్లీ (9,336) తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు. కెప్టెన్‌‌గా 158 మ్యాచ్‌‌ల్లో 87 విజయాలు సాధించాడు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies