Type Here to Get Search Results !

Sports Ad

మెటాలో రూ.9 కోట్ల జాబ్ వదులుకున్న హైదరాబాద్ మహిళ ఈమె ప్లానింగ్ మామూలుగా లేదుగా! This woman from Hyderabad walked away from a Rs 9 crore job at Meta—her plans are truly something else!

భారత్ ప్రతినిధి : ఆమెది పితృస్వామ్య భావజాలం ఉన్న కుటుంబం అంటే ఆడపిల్లలకు ఉద్యోగాలు ఎందుకు ఏదో చదివారు అయిపోయింది పెళ్లి చేసుకుని ఇల్లు చూసుకుంటూ ఉండక అనే మనస్తత్వం. అలాంటి కుటుంబం నుంచి వచ్చి ఉస్మానియా యూనివర్సిటీలో చదివి అక్కడి నుంచి అమెరికా వరకు మోర్గాన్ స్టాన్లీ, అమెజాన్, మెటా లాంటి పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేసిన అనుభవం. అంత ఉన్నత స్థానాలను అందుకున్న మహిళ తన 9 కోట్ల రూపాయల ఉద్యోగానికి రాజీనామా చేసిన న్యూస్ ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది. 

 వివరాల్లోకి వెళ్తే  మెటా కంపెనీలో ఏడాదికి సుమారు 9 కోట్ల 29 లక్షల  (1 మిలియన్ డాలర్లు) జీతం తీసుకుంటున్న బాల సాహిత్య వడ్లమాని తన ఉద్యోగాన్ని వదిలేశారు. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన ఆమె, బిగ్ టెక్ కంపెనీల్లో ఉన్నత స్థానాలను అధిరోహించిన తర్వాత సొంతంగా అడ్వైజరీ ప్రాక్టీస్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు.

 పితృస్వామ్య భావజాలం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన తనకు, సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ కోసమే అమెరికా వెళ్లాలని నిశ్చయించుకున్నట్లు బాల సాహిత్య ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆమె, అక్కడ ఫస్ట్ ర్యాంక్ సాధించారు. అకడమిక్ ఎక్సలెన్స్ కోసం ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ నుంచి ప్రశంసలు అందుకున్నారు. అనంతరం అమెరికాలోని డార్ట్ మౌత్ కాలేజీలో మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ పూర్తి చేశారు. మాస్టర్స్ ప్రోగ్రామ్ సమయంలో డ్యూక్ యూనివర్సిటీలో ఎక్స్ఛేంజ్ స్టూడెంట్ గా చదివి 4.0 జీపీఏ సాధించారు.

కెరీర్ ప్రయాణం
బాల సాహిత్య తన వృత్తిని మోర్గాన్ స్టాన్లీ కంపెనీలో టెక్నాలజీ అనలిస్ట్ గా ప్రారంభించారు. అక్కడ ఆమె ప్రారంభ జీతం ఏడాదికి 1.10 లక్షల డాలర్లు (సుమారు రూ.1.02 కోట్లు). ఆ తర్వాత ఆమె అమెజాన్ లో చేరారు. అక్కడ అలెక్సాలో ఆడియో ఎంటర్‌టైన్‌మెంట్, పేమెంట్స్ విభాగాల్లో పనిచేశారు. అమెజాన్ లో ఆమె జీతం మోర్గాన్ స్టాన్లీ కంటే రెట్టింపు అయ్యింది.

 కొన్నేళ్ల తర్వాత ఆమె ఫేస్ బుక్ మాతృసంస్థ అయిన మెటా కంపెనీలోకి మారారు. అక్కడ ఇన్‌స్టాగ్రామ్, మెసెంజర్‌లో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ వంటి సెక్యూరిటీ ఫీచర్లపై పనిచేశారు. మెటాలో ఆమె  ప్యాకేజీ 1 మిలియన్ డాలర్లకు పైగా చేరింది. తన 28 ఏళ్ల వయసులో మిలియనీర్ అయ్యానని, 31 ఏళ్ల నాటికి ఏడాదికి 1 మిలియన్ డాలర్లకు పైగా సంపాదించినట్లు ఆమె తన లింక్డ్ ఇన్ ప్రొఫైల్ లో పేర్కొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies