Type Here to Get Search Results !

Sports Ad

రికార్డులన్నీ ఖతం రూ.800 కోట్ల క్లబ్‌లో జైలర్ 2 తమిళ సినీ చరిత్రలో తలైవా కొత్త అధ్యాయం All records shattered: 'Jailer 2' enters the Rs 800 crore club—a new chapter in Tamil cinema history written by Thalaivar.


  సినిమా వార్తలు భారత్ ప్రతినిధి : సూపర్‌స్టార్ రజనీకాంత్ బాక్సాఫీస్ వద్ద మరోసారి తన రేంజ్ ఏంటో చూపించారు. తలైవా మాస్ స్వాగ్‌కు కలెక్షన్లు ఫిదా అవుతున్నాయి. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘జైలర్ 2’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ రన్ కొనసాగిస్తోంది. విడుదలైన 18 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.807.25 కోట్ల గ్రాస్ వసూళ్లతో రూ.800 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ సినిమాగా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఒకవైపు ఇండియాలో తన పాత రికార్డులనే బద్దలు కొడుతూ మరోవైపు ఓవర్సీస్‌లోనూ కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ తలైవా తన బాక్సాఫీస్ పవర్‌ను మరోసారి చాటుకున్నారు.

18 రోజుల్లో రూ.807 కోట్లు.. బాక్సాఫీస్ దగ్గర జైలర్ జాతర....
అక్టోబర్ 15న థియేటర్లలోకి వచ్చిన ‘జైలర్ 2’కు మొదటి రోజు నుంచే అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తొలి రోజే ఇండియాలో రూ.59.70 కోట్ల నెట్ వసూళ్లు సాధించి అదిరిపోయే ఓపెనింగ్ అందుకుంది. మొదటి వారంలోనే రూ.334.35 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టి తన జోరు చూపించింది. అయితే రెండో వారంలో వసూళ్లు కాస్త డౌన్ అయినా మూడో వీకెండ్‌లో మళ్లీ పుంజుకుంది. 17వ రోజు రూ.9.70 కోట్లు, 18వ రోజు రూ.11.20 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. దీంతో 18 రోజుల్లో ఇండియాలో రూ.456.30 కోట్ల నెట్, రూ.533.75 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఇక ఓవర్సీస్ నుంచి రూ.273.50 కోట్ల గ్రాస్ వసూళ్లు రావడంతో వరల్డ్‌వైడ్ టోటల్ రూ.807.25 కోట్లకు చేరింది. అంటే మూడు వారాలు కూడా పూర్తికాకుండానే ‘జైలర్ 2’ రూ.800 కోట్ల మార్కును దాటేసి ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies