సానియా ఫేర్‌వెల్ మ్యాచ్.. ముఖ్య అతిధిగా కేటీఆర్
హైదరాబాద్ : భారత టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా ఆదివారం ఎల్బీ స్టేడియంలో జరిగిన ఫేర్ వెల్ మ్యాచ్‌తో సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలికింది. మ్యాచ్ ముగిసిన అనంతరం సానియా ఒక్కసారిగా భావోద్వేగానికిలోనై కంటతడి పెట్టుకుంది.Sania Mirza | భారత టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా ఆదివారం ఎల్బీ స్టేడియంలో జరిగిన ఫేర్‌వెల్ (Farewell) మ్యాచ్‌తో సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలికింది. తన చివరి మ్యాచ్ సింగిల్స్‌లో సానియా vs రోహన్ బోపన్న .. డబుల్స్‌లో సానియా, బోపన్న జోడీ vs ఇవాన్ డోడిక్, మ్యాటెక్ సాండ్స్ తలపడ్డారు. ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం సానియా ఒక్కసారిగా భావోద్వేగానికిలోనై కంటతడి పెట్టుకుంది. ఈ చివరి మ్యాచ్‌ను చూసేందుకు అభిమానులతో పాటు రాజకీయ, క్రీడా, సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.తెలంగాణ ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్(KTR)తో పాటు సినీ నటుడు దుల్కర్ సల్మాన్(dulquer salmaan), మాజీ క్రికెటర్లు యువరాజ్‌సింగ్(Yuvaraj singh), అజారుద్దీన్, ప్రముఖ భారతీయ రాపర్, గీత రచయిత MC స్టాన్ తదితరులు ఎల్బీ స్టేడియంకు చేరుకున్నారు. పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు.
కాంగ్రెస్ లో భారీ చేరికలు ఏడవల్లి కృష్ణ పూర్తిగా చదవడానికి క్లిక్ చేయండి...
పాఠం చెప్తూ...గుండె ఆగింది...టీచర్ మృతి
ప్రజలు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి