తాండూర్ లో గులాబీలు జోరు జోరుగా
- ఘనంగా బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం
- తాండూరు రూపురేఖలు మార్చి చూపిస్తా
- ఒకేసారి గ్రామానికి రూ. 50 లక్షల నిధులు
- మన తెలంగాణను కాపాడుకోవాలంటే మనమందరం బీఆర్‌తోనే ఉండాలి
- కనీవినీ ఎరుగని రీతిలో తరలివచ్చిన ప్రజలు
- ఎమ్యెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూర్ Tandur : తాండూర్ పట్టణంలో యాలాల మండల స్థాయి బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాన్ని ఆదివారం లక్ష్మీనారాయణపూర్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్యెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం తాండూరు ప్రభంజనాన్ని చాటిందని సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణలో పుట్టినందుకు మనం అదృష్టవంతులం దేశంలోనే మన రాష్ట్రం అగ్రగామిగా దూసుకెళ్తుందంటే ఆ గౌరవం ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ గారికే దక్కుతుంది. కావునా మన రాష్ట్ర సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక తెలంగాణ కోసం ఎన్నో ఏళ్లుగా కొట్లాడిన సంగతి మన తాతల దగ్గర నుంచి తెలుసు. కొట్లాడి చావుదాకా పోయి ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చుకున్నాం.పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా మన బీఆర్ఎస్ ముందుకెళ్తుంది.
ఓట్లు అడిగే హక్కు ఒక్క బీఆర్ఎస్‌కే ఉంది.ఎన్నికల్లో చెప్పిన విధంగా మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించండి.తాండూరు రూపురేఖలు మార్చి చూపిస్తానని. ఆ దిశగానే ఇప్పుడు అభివృద్ధి చేసి చూపిస్తున్నా ఇంతకుముందు 3 సార్లు గెలిచిన వాళ్లు కూడా చేయలేని అభివృద్ధినే ఒకేసారి గెలిచిన నేను తాండూరు చరిత్రలోనే అత్యధికంగా నిధులు తీసుకొచ్చిన ఘనత కూడా నాకే దక్కుతుంది.గత 40 సంవత్సరాల నుంచి పెండింగ్ ఓ ఉన్న పనులకు కూడా కార్యరూపం దాల్చి, అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం జరుగుతుంది. ఇంతకు ముందు హాస్పటల్ పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అందరికీ తెలుసు. కానీ నేను హాస్పిటల్, బీసీ భవనం, మాతా శిశు హాస్పిటల్, డిగ్రీ కాలేజీ, గురుకులాలు , రోడ్డు విస్తరణ పనులతో తాండూరు పట్టణం అభివృద్ధి చేసి చూపించిన. దీంతో పాటు ప్రతీ గ్రామపంచాయతీకి రూ.50 లక్షలతో గ్రామం సమస్యలేని గ్రామాలుగా తీర్చి దిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నా. ఒకేసారి గ్రామానికి రూ. 50 లక్షల నిధులు ఇచ్చిన చరిత్ర తెలంగాణలో ఏ గ్రామంలో లేదు.
రైతు సంతోషంగా ఉంటేనే గ్రామాలు బాగుంటాయి.తద్వారా రాష్ట్రం బాగుంటుందని భావించిన మన ముఖ్యమంత్రి గారు.అన్నదాతలకు రైతుబంధు, రైతుబీమా, రైతు వేదికలకు నిధులు మంజూరు చేస్తున్నారు.మహిళలకు పెద్దపీట వేస్తూ దేశంలో ఎక్కడాలేని విధంగా కనీవినీ ఎరుగని రీతిలో కేసీఆర్ కిట్ నుంచి పౌష్టికాహారం, నాణ్యమైన విద్య, గురుకులాలు, వసతి గృహాలు, విదేశాల్లో చదువుకోవాలనుకునేవారికి ప్రభుత్వమే రూ.20 లక్షలు ఇస్తుంది. పెళ్లీడుకు వచ్చాక కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ.
ప్రజలంతా కలిసి ఉద్యమం చేసి తెచ్చుకున్న తెలంగాణలో మతం, కులం పేరుతో కుట్రలు చేస్తూ బీజేపీ, కాంగ్రెప్ చిచ్చులు పెడుతుంది.ఇటువంటి వాళ్లను మీరంతా తరిమితరిమి కొట్టాలి. మనమందరం తాండూరు అభివృద్ధి చెందాలంటే మీరు మరొక్కసారి నన్ను ఆశీర్వదించండి. తాండూరును సమస్యలులేని నియోజకవర్గంగా తీర్చి దిద్దుతా. మన తెలంగాణను కాపాడుకోవాలంటే మనమందరం బీఆర్‌తోనే ఉండాలి. కావునా ప్రజలారా మీ అందరి ఆశీర్వాదం తప్పకుండా గౌరవముఖ్యమంత్రి కేసీఆర్ పైనా.. నాపై ఉండాలని వేడుకుంటున్నా.అతి తక్కువ కాలంలోనే తాండూరు చిత్రలో ఎవ్వరూ చేయని అభివృద్ధి చేసిన నన్ను మరొక్కసారి ఆశీర్వదించండి.తప్పకుండా తాండూరును దేశంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా. యాలాల మండలం నుంచి ఇంత భారీగా తరలివచ్చిన నా అక్కలకు, అమ్మలకు, అన్నలకు, తమ్ముళ్లు మీ అభిమానం నాపై ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా.
ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా యాలాల మండలం నుంచి అన్ని గ్రామాల ప్రజలు భారీ ఎత్తున కదిలి వచ్చారు.తెలంగాణ సంప్రదాయాన్ని చాటుతూ బతుకమ్మలు, ఎండ్లబండు, బంజారా మహిళలు తమ వేషదారణతో వచ్చి ఆకట్టుకున్నారు. ఊహించని విధంగా జనసంద్రంలా ఆత్మీయసమ్మేళనం ప్రాంగణమంతా గులాబీమయమైంది.జనంతో మమేకమైన ఎమ్యెల్యే గారు బంజారా మహిళతో కలిసి సాంప్రదాయ నృత్యం చేయడంతో ప్రాంగణమంతా ఒక్కసారిగా జై రోహిత్ అన్నా అంటూ దద్దరిల్లింది.
భారీ ఏర్పాట్లు ఆత్మీయ సమ్మేళనంలో సందర్బంగా ఎలాంటి లోటుపాట్లు జరగకుండా ఎమ్యెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు మరోసారి తన మార్కు చూపించి హైలైట్ గా నిలిచారు.లక్ష్మీనారాయణపూర్ లో రోడ్డు పక్కనే కనీవినీ ఎరుగని రీతిలో సభను సర్వాంగ సుందరంగా ఏర్పాటు చేయించారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని కూల్ వాటర్, కూలర్లు, మంచి భోజనం పెట్టించారు. రెండు రోజుల ముందుగానే ఏర్పట్లపై దశనిర్దేశం చేసిన ఎమ్యెల్యే గారు ఈ ఆత్మీయ సమ్మేళనంతో బిగ్ సక్సెస్ అయ్యారంటున్నారు ప్రజలు. ఆత్మీయ సమ్మేళనంలో నేతల జోరు ప్రసంగాలు కళాకారుల ఆటాపాటలు, తెలంగాణ ఉద్యమం, సీఎం కేసీఆర్, రోహిత్ అన్నకు సంబంధించిన డీజే పాటలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. మొత్తానికి యాలాల ఆత్మీయ సమ్మేళనం కనీవినీ ఎరుగని రీతిలో తరలివచ్చిన ప్రజలు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ కార్యకర్తలు,అధికారులు ప్రజలు అభిమానులు తదితరులు పాల్కొన్నారు.
మరిన్ని వార్తల కోసం...
- కంసంపల్లి గ్రామంలో ఏప్రిల్ 5వ రోజున అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ ఇక్కడ క్లిక్ చేయండి
- ఏక్మాయి గ్రామంలో బసప్ప కుటుంబానికి రూ.3000/- ఆర్థిక సాయం ఇక్కడ క్లిక్ చేయండి
- తాండూర్ లో గులాబీలు జోరు జోరుగా ఇక్కడ క్లిక్ చేయండి