ఓట్స్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..?
Do you know the health benefits of eating oats?
ఆరోగ్యం Health : ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. తమను తాము ఆరోగ్యంగా ఉంచుకోవడానికి తమ ఆహారంలో ఇటువంటి అనేక ఆహారాలను చేర్చుకుంటారు. వీటిలో ఓట్మీల్ ఒకటి. ప్రతిరోజూ తినడం ద్వారా అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఓట్మీల్ తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉండటమే కాకుండా చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఓట్మీల్ తినడం వల్ల కలిగే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.చాలా మంది ఓట్స్ అల్పాహారంలో భాగంగా తీసుకుంటారు. ఇవి రోజూ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఈ రోజుల్లో వేగంగా మారుతున్న జీవనశైలి కారణంగా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. పెరుగుతున్న పని ఒత్తిడి, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడంతోపాటు ఇతర అంశాలు ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నాయి. అటువంటి పరిస్థితిలో ఆహారాన్ని మార్చడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు.
రోగనిరోధక శక్తి Immunity : ఫైబర్, బీటా-గ్లూకాన్ ఓట్స్‌లో ఉంటాయి.ఇవి గాయం నయం చేయడంలోనూ, రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ సహాయపడతాయి.
మధుమేహం ఉన్నవారికి For those with Diabetes : ఓట్స్‌లో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. కాబట్టి ఇది డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుంది.
గుండెకు ప్రయోజనకరం Good for the heart : ఓట్స్ లో పెద్దమొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడడం ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
క్యాన్సర్ Cancer : ఓట్స్ లిగ్నాన్స్ కు మూలం. ఇవి యాంటీ ఆక్సిడెంట్స్ గా పనిచేస్తాయి. అంతేకాదు అండాశయాలు, రొమ్ము, ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి క్యాన్సర్ సంబంధిత కారకాలతో పోరాడుతాయి.
అధిక బరువు Over Weight : ఓట్స్ తీసుకోవడం వల్ల కడుపు ఎక్కువసేపు నిండుగా అనిపిస్తూ ఉంటుంది. దీనివల్ల ఎక్కువగా తినకుండా ఉండగలుగుతారు. తద్వారా మీ బరువును అదుపులో ఉంటుంది.
మొటిమలు pimples : ఓట్స్‌లో జింక్ పుష్కలంగా ఉంటుంది. ఇది మొటిమలతో పోరాడుతుంది. చర్మంలో ఉండే నుంచి అదనపు నూనెను గ్రహిస్తుంది. తద్వారా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.





