కరెంట్ కోతల పై మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు !
* సీఎం రేవంత్ రెడ్డికి బుద్ధి లేదు
* ఎంజీఎం ఆసుపత్రిలో ఆక్సిజన్ అందగా అస్వస్థత
* జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న ఉద్రిక్తత
వరంగల్ Varangal News భారత్ ప్రతినిధి : వరంగల్ ఎం జీ ఎం ఆస్పత్రి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల 6 గంటల కరెంటు కోత సీ ఎం రేవంత్ రెడ్డి పై జాతీయ మానవ హక్కు కమిషన్ లో ఫిర్యాదు - బక్క జడ్సన్ వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి కుటుంబ సభ్యులకు ఎలాంటి వైద్య అవసరం వచ్చిన ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రమే వైద్యం చేయించుకోవాలని నిబంధనతో చట్టం చేయాలని తద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు బాగుపడతాయని పేదవాడికి సరైన వైద్యం అందుతుందని వరంగల్ ఎం జీ ఎం ఆస్పత్రిలో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 6గంటల పాటు కరెంటు కోత తో పేదలు, వైద్యం కోసం ఆసుపత్రిలో ఉన్న వారు కార్డియాలో, ఎమర్జెన్సీ వార్డులో మరియు డయాలసిస్, పిల్లల వార్డులలో వైద్యం కోసం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇబ్బందులు పడ్డారని దీనికి కారణం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్లక్ష్యమే అని వెంటనే విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో నేడు (24-05-2024) వరంగల్- ఖమ్మం- నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి, ఉమ్మడి రాష్ట్ర మాజీ చైర్మన్ బక్కజడ్సన్ ఫిర్యాదు చేశారు.
వరంగల్ జిల్లాలో మహాత్మాని పేరుతో ఉన్న ఎంజీఎం ఆసుపత్రిలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంజీఎంలో పేషంట్లను ఎలుకలు కొరికి ఇబ్బందులు పెడుతున్నాయని, పేషెంట్లు మరణించారని, ఎలుకలు కొరుకుతున్నాయని పత్రికలలో చూసామని నాటినుండి నేటి కాంగ్రెస్ ప్రభుత్వంలో 100 రోజులు దాటినా కూడా పరిస్థితులు మెరుగుపడకపోవడం సిగ్గుచేటని అన్నారు . సీఎం రేవంత్ రెడ్డి పలికిన పలుకులు రాష్ట్రంలో ప్రభుత్వంలోకి వచ్చిన నాటి నుండి ఒక్కరోజు కూడా ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రిలో, గాంధీ ఆసుపత్రిలో, రాష్ట్రంలో ఉన్న వరంగల్ ఎం జీ ఎం లాంటి ఒక్క ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా పరిస్థితులను ప్రత్యక్షంగా పర్యవేక్షించలేదని పేదలపై తనకున్న ప్రేమ ఎంతో అర్థమవుతుందని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో సుమారు 6 గంటల పాటు కరెంటు పోవడం బాధాకరమని అదే విధంగా భువనగిరి లో కూడా సెల్ ఫోన్ టార్చ్ లైట్ తో వైద్యం అందిస్తున్న వార్త పత్రికలలో చూడడం జరిగిందని ఇంతటి నిర్లక్ష్య ప్రభుత్వం పేదవాడిపై ఎంత నిర్లక్ష్యము అర్థమవుతుందని ప్రశ్నించే గొంతుకలు అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వరంగల్ ఎంజీఎం పరిసర ప్రాంతాలలో పర్యటిస్తూ ఓట్లు కావాలనే గొంతుక తెరుస్తున్నారే తప్ప ఎంజీఎం కు వెళ్లి పత్రికలో వచ్చిన దానిపై స్పందించకపోవడం అందరూ ఆలోచించాలని రాష్ట్రంలో పేదవాడికి సరైన వైద్యం అందాలంటే రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారి కుటుంబ సభ్యులు ఎవరికైనా వైద్యం అవసరం ఉంటే ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రమే చికిత్స చేసుకోవాలని నిబంధన ఉన్న నాడే పేదవాడికి సరైన వైద్యం అందుతుందని తన సూచనను, అభిప్రాయాన్ని బక్క జడ్సన్ వ్యక్తం చేశారు.
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ వెంటనే వరంగల్ ఎంజీఎంలో నిర్లక్ష్యంతో సుమారు 6 గంటలు కరెంటు పోయిన సంఘటనపై మరియు భువనగిరిలో సెల్ఫోన్ టార్చ్ తో వైద్యం అందిస్తున్న దానిపై బాధ్యులు సీఎం రేవంత్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని బక్క జడ్సన్ విజ్ఞప్తి చేశారు.ఖమ్మం -వరంగల్- నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నా యొక్క మేనిఫెస్టోలో ప్రభుత్వ ఆసుపత్రుల మెరుగుదల పై పేదల వైద్యంపై ప్రత్యేక చర్యలు అను అంశంపై వరంగల్ ఎంజీఎం పాటు కరెంటు పోవడం మరియు భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో సెల్ ఫోన్ టార్చ్ లైట్ ద్వారా వైద్యం అందిస్తున్న ఈ సంఘటనలపై స్పందించడం జరిగిందని బక్క జడ్సన్ తెలియజేశారు.





