Type Here to Get Search Results !

Sports Ad

చుక్కలు చూపిస్తున్న టమాటా ధర ఏకంగా రూ.100 The price of spotted tomato is Rs.100


చుక్కలు చూపిస్తున్న టమాటా ధర ఏకంగా రూ.100

Telangana News తెలంగాణ భారత్ ప్రతినిధి : సాధారణంగా వర్షాకాలంలో కూరగాయల ధరలు తగ్గాలి. కానీ ఈ ఏడాది మాత్రం అందుకు భిన్నంగా ఉంది. కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ముఖ్యంగా అందరూ మెచ్చే టమాట ధర ఏకంగా సెంచరీ కొట్టింది.సామాన్యులకు 'టమాటా' చుక్కలు చూపిస్తోంది. కిలో ధర రూ.100 పలుకుతుండటంతో చాలా మంది టమాటాకు టాటా చెబుతున్నారు.హైదరాబాద్లో రైతు బజార్లలోనూ నిర్ణయించిన ధరకు మించి విక్రయాలు సాగిస్తున్నారని కొనుగోలుదారులు వాపోతున్నారు. కిలో రూ.51 ఉంటే రూ.70కి తగ్గకుండా అమ్ముతున్నారని.ఇదేంటని ప్రశ్నిస్తే పుచ్చులు, మచ్చలున్న, మెత్తటి టమాటాలు తీసుకోవాలంటున్నారని వాపోతున్నారు. ఇక బహిరంగ మార్కెట్‌లో రూ.90 నుంచి రూ.100 వరకు విక్రయాలు సాగిస్తుండటంతో చాలా మంది మధ్య తరగతి వినియోగదారులు అసలు టమాటాల వైపే చూడటం లేదు.ప్రతిరోజూ నగరంలో రైతుబజార్లకు 6వేల క్వింటాళ్ల టమాటాలు వచ్చేవి. తొలకరి పంట చేతికందక ప్రస్తుతం 2.5 నుంచి 3వేల క్వింటాళ్లే వస్తోంది. దీంతో డిమాండ్‌ పెరిగి ధర కొండెక్కిందని వ్యాపారులు అంటున్నారు. సెప్టెంబరు వరకు దిగుబడి వచ్చే పరిస్థితి లేకపోవడంతో ధరలు ఇలాగే ఉండే అవకాశముందని చెబుతున్నారు.

Generally, the prices of vegetables should decrease during the rainy season. But this year is different. Vegetable prices are skyrocketing. Especially the price of tomato, which is loved by everyone, has hit a century.As the price of a kilo is Rs.100, many people are saying Tata to the tomato. In Hyderabad, the buyers are complaining that they are selling beyond the fixed price. If it is Rs.51 per kg, they are selling it at Rs.70.They complain that they want to take soft tomatoes. Many middle class consumers are not looking at real tomatoes as they are selling at Rs.90 to Rs.100 in the open market. Every day, 6 thousand quintals of tomatoes come to the farmers' markets in the city.At present, the harvest of tholakari crop is only 2.5 to 3 thousand quintals. Traders say that the demand has increased and the price has gone up. It is said that the prices are likely to remain the same as there is no yield till September.

మరిన్ని వార్తల కోసం....
* ఆర్టీసీ కార్మికుల సమస్యలపై అసెంబ్లీలో చర్చ ఇక్కడ క్లిక్ చేయండి
* డెలివరీ బాయ్ ముసుగులో సాఫ్ట్వేర్ ఉద్యోగులకు డ్రగ్స్ సరఫరా ఇక్కడ క్లిక్ చేయండి
* IITలో సీటు వచ్చినా మేకలు కాస్తున్న విద్యార్థిని ఇక్కడ క్లిక్ చేయండి
* చుక్కలు చూపిస్తున్న టమాటా ధర ఏకంగా రూ.100 ఇక్కడ క్లిక్ చేయండి
* ఆర్టీసీ బస్సును ఢీకొన్న బైక్ ఇద్దరు యువకులు మృతి ఇక్కడ క్లిక్ చేయండి
* త్వరలో నీట్ యూజీ తుది ఫలితాలు విడుదల ఇక్కడ క్లిక్ చేయండి


 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies