ఆర్టీసీ బస్సును ఢీకొన్న బైక్ ఇద్దరు యువకులు మృతి
Hyderabad News హైదరాబాద్ భారత్ ప్రతినిధి : హైదరాబాద్ లోని చందానగర్‌లో బుధవారం ఉదయం ఆర్టీసీ బస్సును ఓ బైకు రాంగ్ రూట్ లో వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు మృతి చెందారు.కాగా మృతులను చందానగర్‌కు చెందిన మనోజ్,రాజులుగా గుర్తించారు. ఇక ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.పోస్టుమార్టం నిమ్మితం మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.అయితే మదీనాగుడ జీఎస్ఎం మాల్ నుంచి చందానగర్‌కు బైక్‌పై మనోజ్,రాజులు వెళుతున్నారు. చందానగర్ జీఎస్ఎం మాల్ సమీపంలో యుటర్న్ దగ్గర రాంగ్ రూట్‌లో వెళుతూ.ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టారు.బైక్ నడుపుతున్న మనోజ్ తో పాటు వెనకాల కూర్చున్న రాజు కూడా అక్కడికక్కడే చనిపోయాడు.
On Wednesday morning in Chandanagar, Hyderabad, a bike hit an RTC bus on the wrong route. Two youths who were traveling on a bike died in this accident. The deceased have been identified as Manoj and Raju from Chandanagar.Identified. The police registered a case on this accident. The bodies were shifted to the government hospital for post-mortem. However, Manoj and Raj were going to Chandanagar on a bike from Madinaguda GSM Mall. Chandanagar Near GSM Mall Uturn While going on the wrong route, the oncoming RTC bus collided with Manoj, who was riding the bike, and Raju, who was sitting behind, also died on the spot.