డెలివరీ బాయ్ ముసుగులో సాఫ్ట్వేర్ ఉద్యోగులకు డ్రగ్స్ సరఫరా
Hyderabad News హైదరాబాద్ భారత్ ప్రతినిధి : డెలివరీ బాయ్ ముసుగులో డ్రగ్స్ సరఫరా చేస్తున్న వ్యక్తిని టీజీ న్యాబ్ మాదాపూర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడి నుంచి 15 గ్రాముల ఎండీఎంఏ 22.5 కేజీల గంజాయి, 491 గ్రాముల హ్యాష్ ఆయిల్, 71 నైట్రోజన్ ట్యాబ్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.గచ్చిబౌలి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాదాపూర్ డీసీపీ వినీత్ కేసు వివరాలను వెల్లడించారు.
ఏపీలోని రాజమహేంద్రవరానికి చెందిన షేక్ బిలాల్(28) ఇంటర్ చదివే సమయంలోనే గంజాయికి అలవాటు పడ్డాడు. కరోనా తర్వాత హైదరాబాద్ మాదాపూర్ ఇజ్జత్‌నగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. జొమాటో డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ పాత పరిచయాల నేపథ్యంలో అరకు నుంచి గంజాయి తెచ్చి దాదాపు 40,50 మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు విక్రయిస్తున్నాడు. పక్కా సమాచారంతో నిందితుడి ఇంట్లో తనిఖీలు నిర్వహించిన పోలీసులు మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడికి డ్రగ్స్ సరఫరా చేస్తున్న ప్రధాన నిందితుడు భాను తేజ జైలులో ఉన్నాడని, అతన్ని కస్టడీకి తీసుకొని విచారిస్తామని డీసీపీ తెలిపారు.
TG Naib Madapur police arrested a person who was supplying drugs under the guise of a delivery boy and sent him to remand. 15 grams of MDMA, 22.5 kg of ganja, 491 grams of hash oil and 71 nitrogen tablets were seized from the accused.Madapur DCP Vineet revealed the details of the case in a media conference. Sheikh Bilal (28) from Rajamahendravaram in AP got addicted to ganja while studying for Inter. After Corona, he is residing in Madapur Izzatnagar Colony, Hyderabad. From Araku on the back of old acquaintances working as a Zomato delivery boy He brings ganja and sells it to about 40.. 50 software employees. The police conducted searches at the accused's house on the basis of information and seized the drugs. The DCP said that Bhanu Teja, the main accused who was supplying drugs to the accused, is in jail and he will be taken into custody and questioned.