కొవ్వు కాలేయంతో బాధపడుతున్నారా ఈ ఆహారంతో మంచి ఫలితాలు
ఆరోగ్యం Health News భారత్ ప్రతినిధి : నిత్యం ఉరుకులు పరుగుల జీవితంలో మన జీవన శైలిలో మార్పులు, అంతర్గత ఆరోగ్య సమస్యల కారణంగా చాలా మందిలో కొవ్వు కాలేయం సమస్యతో బాధపడుతుంటారు. అయితే తీసుకునే కొన్ని ఆహార పదార్థాలతో కొవ్వు కాలేయం సమస్యను కొంతవరకు తగ్గించుకోవచ్చంటున్నారు ఆహార నిపుణులు. కొవ్వు కాలేయం తగ్గించేందుకు సాయపడే కొన్ని రకాల ఆహార పదార్థాల గురించి మనం తెలుసుకుందాం.
ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఇవి ఎక్కువగా చేపల్లో ఎక్కువగా ఉంటాయి. ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కాలేయ కొవ్వు, వాపును తగ్గించడంలో ఎంతో సాయపడతాయి. కాబట్టి కొవ్వు కాలేయం ఉన్నవారు క్రమతప్పకుండా వారి ఆహారంలో చేపలు తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.
గింజలు....
ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన గింజలు కాలేయ పనితీరును మెరుగు పరుస్తాయి. కాలేయం వాపును తగ్గించడంలో సహాయపడతాయి.
అవకాడోలు..
అవకాడోలు చెడు కొలెస్ట్రాల్ తగ్గించడం, కాలేయ కొవ్వును తగ్గించడం ద్వారా కాలేయ ఆరోగ్యానికి తోడ్పడతాయి. కాబట్టి అవకాడోలను రోజు వారీ ఆహారంలో చేర్చుకుంటే కాలేయం కొవ్వును తగ్గించుకోవచ్చు.
గ్రీన్ టీ..
గ్రీన్ టీలో కాటెచిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కాలేయ కొవ్వు, వాపును తగ్గించడంలో సహాయపడతాయి. గ్రీన్ టీని రోజుకు ఒకసారి తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలుంటాయంటున్నారు నిపుణులు.
అలివ్ ఆయిల్..
అలివ్ ఆయిల్ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఇందులో మోనో అన్ శాచురేటెడ్ కొవ్వులు అధికంగా ఉండటం వల్ల ఇది కాలేయం ఎంజైమ్ స్థాయిలను మెరుగు పరుస్తుంది. దీంతో కాలేయం లో కొవ్వు స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.
వెల్లుల్లి....
వెల్లుల్లి లో అల్లిసిన్ , సెలీనియం వంటి ఆర్గానోసల్ఫర్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి కాలేయాన్ని శుభ్రపరుస్తాయి. కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గిస్తాయి. పైన తెలిపిన ఆహార పదార్థాలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా కాలేయం కొవ్వును తగ్గించుకోవడంతో ఆరోగ్యంగా ఉండొచ్చంటున్నారు ఆహార నిపుణులు.
Many people suffer from fatty liver due to changes in our lifestyle and internal health problems due to regular running. But food experts say that fatty liver problem can be reduced to some extent with some food items. Let us know about some types of foods that can help reduce fatty liver. Omega-3 fatty acids are mostly found in fish.





