నవంబర్ లో టెట్ ఫిబ్రవరిలో మరో డీఎస్సీ
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : చర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్)కు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తున్నది. నవంబర్ లో టెట్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు. దరఖాస్తుల ప్రక్రియతో పాటు ప్రిపరేషన్‌కు మూడు నెలలు ఇవ్వనున్నారు. అనంతరం వచ్చేఏడాది జనవరిలో ఆన్లైన్ పరీక్షలు నిర్వహించనున్నారు.
ఇదిలా ఉండగా మరో డీఎస్సీ వేసేందుకు సర్కారు సిద్ధమవుతున్నది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారమే ముందుకు వెళ్లాలని భావిస్తున్నది. రాష్ట్రంలో 11,062 టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహిస్తున్న డీఎస్సీ 2023 ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటికే ఆన్లైన్లో పరీక్షలు పూర్తికాగా, ప్రిలిమినరీ కీని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు రిలీజ్ చేశారు.
త్వరలోనే ఫైనల్ కీతోపాటు జీఆర్ఎల్ కూడా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం 1: 30 టీచర్ స్టూడెంట్ రేషియో ఉండాల్సి ఉండగా, రాష్ట్రంలో మాత్రం 1: 16 రేషియో ఉంది. రేషనలైజేషన్ చేస్తే చాలా పోస్టులు మిగిలిపోతాయని అధికారులు చెప్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినట్టుగానే అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. దీన్ని అమలు చేసేందుకు ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టింది.
దీనికి అనుగుణంగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో డీఎస్సీ–2025 నోటిఫికేషన్ ఇవ్వాలని భావిస్తోంది. ఏప్రిల్ లేదా మే నెలలో పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే, ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రభుత్వ పెద్దలు ఐదు వేల పోస్టులతో డీఎస్సీ వేస్తామంటూ ప్రకటనలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రైమరీ స్కూళ్లలో ప్రీప్రైమరీ తరగతులు ప్రారంభించేందుకూ సర్కారు కసరత్తు చేస్తున్నది. ఈ బడుల్లో పాఠాలు చెప్పేందుకు డీఎస్సీ–2025 ద్వారా టీచర్లను తీసుకోవాలని భావిస్తున్నది.
The education department is making arrangements for the Char Eligibility Test (TET). Officials are planning to give Tet notification in November. Along with the application process, three months will be given for preparation. After that, online exams will be conducted in January next year.
Meanwhile, the government is preparing to launch another DSC. The education department is making arrangements to give notification in February next year. It is expected to proceed as per the already announced job calendar. The DSC 2023 process for filling 11,062 teacher posts in the state is ongoing.
Arrangements are being made to release the GRL along with the final key soon. According to the Right to Education Act, there should be a teacher student ratio of 1:30, but the state has a ratio of 1:16. Officials say that rationalization will leave many posts. In this order, the Congress party's election manifesto
Accordingly, it is expected to give notification of DSC-2025 in February next year. The exams will be conducted in the month of April or May. However, on many occasions, government leaders have already announced that they will create DSC with 5,000 posts. Preprimary in all primary schools across the state.