Type Here to Get Search Results !

Sports Ad

టీ20 వరల్డ్ కప్ యూఏఈ బయలుదేరిన భారత మహిళల క్రికెట్ జట్టు Indian Women's Cricket Team Left For T20 World Cup UAE

టీ20 వరల్డ్ కప్ యూఏఈ బయలుదేరిన భారత మహిళల క్రికెట్ జట్టు

జాతీయ National News భారత్ ప్రతినిధి : మహిళల టీ20 వరల్డ్ కప్ కు సమయం ఆసన్నమైంది. అక్టోబర్‌ 3 నుంచి యూఏఈ వేదిక‌గా మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ప్రారంభం కానుంది. వాస్తవానికి ఈ టోర్నీ బంగ్లాదేశ్‌లో జరగాల్సి ఉండగా రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో యూఏఈకి తరలించారు. ఈ టోర్నీ కోసం భారత మహిళల జట్టు మంగళవారం (సెప్టెంబర్ 24) యూఏఈ కి బయలుదేరారు. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత మహిళల క్రికెట్ జట్టు యూఏఈ కి వెళ్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 చివరిసారిగా జరిగిన టీ20 వరల్డ్ కప్ ఆస్ట్రేలియాపై సెమీస్ లో ఓడిపోయిన మన జట్టు ఈ సారి టైటిలే లక్ష్యంగా బయలుదేరుతుంది. ప్రీ డిపార్చర్ ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ హర్మాన్ ప్రీత్ కౌర్ మాట్లాడుతూ "మేము అత్యుత్తమ జట్టుతో ముందుకు వెళ్తున్నాం. ఆటగాళ్లు చాలా కాలంగా కలిసి ఆడుతున్నారు. మేము చివరిసారిగా జరిగిన వరల్డ్ కప్ లో చాలా దగ్గరగా వచ్చి సెమీస్‌లో ఓడిపోయాము. ఈ సారి ఆ పొరపాటును రిపీట్ కాకుండా చూసుకుంటాం. 

టైటిల్ పోరులో 10 జట్లు....
ఈ మెగా టోర్నీ 18 రోజుల పాటు అభిమానులను అలరించనుంది. టైటిల్ రేసులో మొత్తం 10 జ‌ట్లు ఉండగా వీటిని రెండు గ్రూపులు విభ‌జించారు. గ్రూప్‌-ఏలో భారత్‌, ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌, శ్రీలంక జట్లు ఉండగా గ్రూప్‌-బిలో బంగ్లాదేశ్‌, సౌతాఫ్రికా, ఇంగ్లాండ్‌, వెస్టిండీస్‌, స్కాట్లాండ్ ఉన్నాయి. గ్రూప్ దశలో ప్ర‌తి జట్టు ఇతర జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడ‌నుంది.

 అనంతరం గ్రూపులో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జ‌ట్లు సెమీఫైన‌ల్‌కు అర్హత సాధిస్తాయి. లీగ్‌ మ్యాచ్‌లు దుబాయ్‌, షార్జా వేదికగా జరకానున్నాయి. అక్టోబర్‌ 17, 18 తేదీల్లో సెమీఫైనల్స్ నిర్వ‌హించ‌నున్నారు. సెమీఫైన‌ల్స్‌కు షార్జా వేదిక కానుంది. ఇక ఫైన‌ల్ దుబాయ్ వేదిక‌గా అక్టోబ‌ర్ 20న జ‌ర‌గ‌నుంది. సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 1 వరకు వార్మప్ మ్యాచ్‌లు జరగనున్నాయి.

The time has come for the Women's T20 World Cup. The Women's T20 World Cup is going to start from October 3 at the UAE venue. Originally, this tournament was supposed to be held in Bangladesh, but it was moved to UAE due to political uncertainty. The Indian women's team left for the UAE on Tuesday (September 24) for this tournament.

 Having lost in the semis against Australia in the last T20 World Cup, this time our team will be aiming for the title. "We are going ahead with the best team. The players have been playing together for a long time," Team India captain Harmanpreet Kaur said during the pre-departure press conference.

మరిన్ని వార్తల కోసం....  
* నెలకు 1 శాతం వడ్డీకి ​ బంగారం లోన్లు ఇక్కడ క్లిక్ చేయండి
* తెల్ల రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం ఇక్కడ క్లిక్ చేయండి
* నవంబర్ లో టెట్ ఫిబ్రవరిలో మరో డీఎస్సీ ఇక్కడ క్లిక్ చేయండి
* సెప్టెంబర్ 27 నుండి 2008 డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies