జుట్టు ఏపుగా పెరగాలంటే
Health News భారత్ ప్రతినిధి : ప్రస్తుతం మారుతున్న జీవనశైలితో పాటు కాలుష్యం, హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ వల్ల విపరీతంగా జుట్టు రాలుతోంది. ఈ సమస్యతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారు ఈ చిన్న టిప్స్ ఫాలో అవ్వడం వల్ల జుట్టు రాలే సమస్యే ఉండదు. అంతే కాకుండా జుట్టు బాగా పెరుగుతుంది కూడా జుట్టు పెరగడానికి పాటించాల్సి టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పట్టుకుచ్చుల్లాంటి పొడవైన జుట్టు కావాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. ముఖ్యంగా అమ్మాయిలు పొడవైన జుట్టు కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.
ముఖ్యంగా జుట్టు రాలకుండా ఉండాలంటే తల శుభ్రంగా ఉండాలి. తలస్నానం చేసినప్పుడు జుట్టు రాలడం అనేది అందరికే ఓ పెద్ద టాస్క్. అందుకే జుట్టు త్వరగా ఆరాలనే ఉద్ధేశ్యంతో చాలా మంది హెయిర్ డ్రయర్‌లను వాడుతూ ఉంటారు. ఇవి జుట్టు పెరుగుదలను అడ్డుకుంటాయి. అంతే కాకుండా హెయిర్‌ను చాలా వరకు డ్యామేజ్ చేస్తాయి. కేవలం స్టైలింగ్, స్ట్రెయిట్‌నింగ్ లే కాకుండా ఎండలో అతిగా తిరగడంతో పాటు జడను గట్టిగా అల్లడం వల్ల కూడా జుట్టు రాలుతుందని నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా చాలా మంది తలస్నానం చేసిన తర్వాత జుట్టు తడి పోవాలని తువాలుతో కొట్టడం వంటివి చేస్తుంటారు. ఇలాంటివి కూడా జుట్టుకు హాని కలిగిస్తాయి.హెయిర్ డ్రయ్యర్లు, స్ట్రెయిట్నర్లు, జుట్టు కుదుళ్లకు కెరాటిన్ నష్టాన్ని కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. కెరాటిన్ దెబ్బతినడం వల్ల జుట్టు బలహీనపడుతుంది. తద్వారా జుట్టు రాలడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి.తలస్నానం చేసిన తర్వాత కండిషనర్ అప్లై చేసే అలవాటు చాలా మందికి ఉంటుంది.
అలాంటి వారు జుట్టుకు కండీషనర్ అప్లై చేసిన తర్వాత దువ్వెనతో దువ్వుతారు. కానీ ఇది సరైన పద్దతి కాదు. జుట్టు తడిగా ఉన్నప్పుడు దువ్వడం వల్ల జుట్టు కుదుళ్లు బలహీనపడతాయి. ఫలితంగా జుట్టు రాలే సమస్య బాగా పెరగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితిలోనూ తడి జుట్టును దువ్వెనతో దువ్వకుండా ఉండాలి. జుట్టు పూర్తిగా ఆరిన తర్వాతే దువ్వాలని నిపుణులు చెబుతున్నారు. జుట్టుకు ఆయిల్ పెట్టకుంటే జిడ్డుగా ఉంటుందని, లేదా సమయం లేదనే కారణంతో చాలా మంది జుట్టుకు ఆయిల్ పెట్టుకోరు.
Nowadays, along with changing lifestyles, pollution and hair care products are causing excessive hair loss. Many people are struggling with this problem. If such people follow these small tips then there will be no problem of hair fall. Apart from that, let's know about the tips to follow for hair growth. Everyone wants to have long luscious hair.
In particular, the head should be clean to prevent hair loss. Falling hair while taking a shower is a big task for everyone. That's why many people use hair dryers to dry their hair quickly. These inhibit hair growth. Apart from that, they damage the hair a lot. Experts say that apart from styling and straightening, excessive sun exposure and tight braiding can also cause hair loss.
Especially after taking a shower, many people use towel to wet their hair. Experts say that hair dryers, straighteners, and keratin damage hair follicles. Keratin damage weakens the hair. So there are more chances of hair fall. Many people have the habit of applying conditioner after taking a shower.
Such people comb their hair after applying conditioner. But this is not the correct method. Combing the hair while wet weakens the hair follicles. As a result, the problem of hair loss increases. So under no circumstances should you comb wet hair with a comb. Experts say that the hair should be combed only after it is completely dry. Many people don't oil their hair either because they feel greasy or don't have the time to do so.
మరిన్ని వార్తల కోసం....
* వర్షాకాలం బత్తాయితో బోలెడు లాభాలు ఇక్కడ క్లిక్ చేయండి
* ఘనంగా ఏకాంబరి రామలింగేశ్వర జాతర ఇక్కడ క్లిక్ చేయండి
* బాధ పడొద్దు అందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం ఇక్కడ క్లిక్ చేయండి
* దాల్చిన చెక్కతో షుగర్ కంట్రోల్ ఎలా వాడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
* కొబ్బరితో కోరినన్ని లాభాలు కొన్ని ఇంట్రెస్టింగ్ సంగతులు ఇవి ఇక్కడ క్లిక్ చేయండి
* వాతావరణ హెచ్చరికలు రాష్ట్రంలో మరో 2 రోజులు అక్కడక్కడ భారీ వర్షాలు ఇక్కడ క్లిక్ చేయండి
* రాత్రిళ్లు పిక్కలు పట్టేస్తున్నాయా అయితే ఇలా చేయండి క్షణాల్లో ఉపశమనం ఇక్కడ క్లిక్ చేయండి
* వరదలు ముంచెత్తడం బాధాకరం తెలుగు రాష్ట్రాలకు సిద్దు జొన్నలగడ్డ సాయం ఇక్కడ క్లిక్ చేయండి
* యూపీ సర్కార్ మరో కీలక నిర్ణయం ప్రభుత్వ ఉద్యోగులకు ఆగస్ట్ నెల జీతాలు ఆపేశారు ఇక్కడ క్లిక్ చేయండి





