ఈ నెల 17.18న తిరుపతిలో ఎమ్మార్పీఎస్ జాతీయ సదస్సును విజయవంతం చేయండి
* తాండూర్ నియోజవర్గంలో కొందరు వెక్తులు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం
* ఎమ్మార్పీఎస్ సంఘాన్నిపేరును ఉపయోగించుకుంటే సయించేది లేదు
* ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ మల్లికార్జున్ మాదిగ
తాండూర్ Tandur News : నేడు తాండూర్ లో ఎమ్మార్పీఎస్ మరియు ఎం ఎస్ ఎఫ్ ముఖ్య నాయకులు సమావేశాన్ని జిల్లా కో కన్వీనర్ పి.ప్రకాష్ మాదిగ ఆధ్వర్యంలో తాండూర్ పట్టణంలో సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ కే.మల్లికార్జున్ మాదిగ పాల్గొని మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం మందకృష్ణమాదిగ గారి నాయకత్వంలో దాదాపు 29 సంవత్సరాలుగా పోరాడుతున్నం అని అన్నారు గతంలో ఎమ్మార్పీఎస్ మందకృష్ణమాదిగ పోరాట పలితంగా 1999 నుచి 2005 వరకు దాదాపు 5సం"రాలు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాదించుకొన్న విషయం గుర్తు చేశారు.
ఎమ్మార్పీఎస్ మాదిగల తో పాటు సమాజంలో జరుగుతున్న అసమానతలపైన బడుగు బలహీన వర్గాలకు జరుగుతున్న అన్యాయం వారి పక్షాన నిలబడి బలంగా కొట్లాడుతున్న సంఘమని గుర్తు చేశారు ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరణ సాధించడంలో మనం అంతిమ దశకు చేరుకున్నామని గుర్తు చేశారు అట్లాగే ఎమ్మార్పీఎస్ తాండూర్ నియోజకవర్గలో ఈ మధ్యకాలంలో ఎమ్మార్పీఎస్ సంఘానికి ఎలాంటి సంబంధం లేని నాయకులు ఎమ్మార్పీఎస్ పేరును ఉపయోగించుకొని వాళ్ల స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం సంఘాన్ని రాజకీయాలకు వాడుకునే ప్రయత్నం చేస్తున్నరు అని మా జిల్లా నాయకత్వం దృష్టికి రావడంతో గతంలోనే ఎమ్మార్పీఎస్ నుంచి అట్లాగే మహాజన సోషలిస్టు పార్టీ నుంచి పెద్దోళ్ల ఆనంద్ కుమార్ ను..మహాజన సోషలిస్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తీగల ప్రదీప్ గౌడ్ దేశాల మేరకు వికారాబాద్ జిల్లా కోఆర్డినేటర్ పి.ఆనంద్ మాదిగ అధికారికంగా తాండూర్ నియోజకవర్గ ఇన్చార్జి పదవి నుంచి పెద్దోళ్ల ఆనంద్ ను సస్పెండ్ చేయడం జరిగింది గుర్తు చేశారు.
ఈ మధ్య కాలంలో వివిధ సందర్భాల్లో సంఘం నిర్ణయాన్ని దిక్కరిస్తు అధినాయకత్వం గౌరవం లేకుండా సంఘం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎమ్మార్పీఎస్ పేరును మహాజన సోషలిస్టు పార్టీ పేరును సోషల్ మీడియాలో లోకల్ పేపర్లలో వాడుకోవడం సర్యైన పద్దతి కాదని మరోసారి గుర్తు చేస్తున్నాం ఎమ్మార్పీఎస్ ఉద్యమాన్ని మీ స్వార్థాల రాజకీయాలకోసం ఉపయోగిస్తే కనుక కచ్చితంగా చర్యలు ఉంటాయని హెచ్చరించరు.ఇకపోతే ఈనెల 17 18న తిరుపతి నగరంలో జరగబోయే ఎంఆర్పిఎస్ జాతీయ సదస్సును మన నియోజకవర్గం నుంచి నాలుగు మండలాల అధ్యక్షులు ముఖ్య నాయకులు తప్పనిసరిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా కో కన్వీనర్లు శేకర్ మాదిగ. పి. ప్రకాష్ మాదిగ,ఎంఎస్ఎఫ్ తాండూర్ మండలం ఇంఛార్జి వెంకట్ మాదిగ ఎంఎస్ఎఫ్ యలాల్ మండల ఇంఛార్జి అజయ్ ప్రసాద్, చెందు,అనిల్, అశోక్,రాము, ప్రసాద్,మల్లేష్ తదితరులు వెంకట్ పాల్గొన్నారు.