Type Here to Get Search Results !

Sports Ad

వచ్చే 14 నెలల్లో 30 ప్రయోగాలు, 30 experiments in next 14 months,


 వచ్చే 14 నెలల్లో 30 ప్రయోగాలు, 

* అంతరిక్ష రంగంలో జోరు చూపించనున్న భారత్‌

బెంగళూరు Bangalore News భారత్ ప్రతినిధి : రోదసి రంగంలో వరుస ప్రయోగాలతో సత్తా చాటేందుకు భారత్‌ సిద్ధమవుతోంది. రానున్న 14 నెలల్లో మన దేశం దాదాపు 30 అంతరిక్ష ప్రయోగాలు చేపట్టనున్నట్లు ‘ఇండియన్‌ నేషనల్‌ స్పేస్‌ ప్రమోషన్‌ అండ్‌ ఆథరైజేషన్‌ సెంటర్‌ (ఇన్‌-స్పేస్‌) వెల్లడించింది. ఈ మేరకు తాజాగా సమీకృత ప్రయోగ మేనిఫెస్టోను ప్రకటించింది. వచ్చే 14 నెలల్లో చేపట్టనున్న ప్రయోగాల్లో ప్రతిష్ఠాత్మక గగన్‌యాన్‌ ప్రాజెక్టుకు సంబంధించినవి ఏడు ఉన్నాయని అందులో తెలిపింది. స్కైరూట్‌, అగ్నికుల్‌ వంటి ప్రైవేటు అంతరిక్ష అంకుర సంస్థల ప్రయోగాలూ ఏడు ఉన్నట్లు పేర్కొంది. వాతావరణ అంచనాలు, విపత్తు నిర్వహణ సంబంధిత సేవల కోసం రూపొందించిన ‘ఇన్‌శాట్‌-3డీఎస్‌’ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌14 ప్రయోగాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ ఆర్థిక సంవత్సరంలోనే చేపట్టనుంది. మార్చిలో ‘ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ3’ మూడు పేలోడ్‌లను నింగిలోకి మోసుకెళ్లనుంది. ఇస్రో వాణిజ్య విభాగమైన ‘న్యూస్పేస్‌ ఇండియా లిమిటెడ్‌’2 Full stop నాలుగు పీఎస్‌ఎల్‌వీ, రెండు ఎస్‌ఎస్‌ఎల్‌వీ, ఒక ఎల్‌వీఎం-3 మిషన్‌ను చేపట్టాలని భావిస్తున్నట్లు మేనిఫెస్టోలో పేర్కొన్నారు.

మరిన్ని వార్తల కోసం... 
* వచ్చే 14 నెలల్లో 30 ప్రయోగాలు, ఇక్కడ క్లిక్ చేయండి
* ఢిల్లీ సరిహద్దుల్లో మరోసారి రైతుల మహాధర్నా.. ఆపేందుకు హుటాహుటిన వెళ్లిన కేంద్ర మంత్రులు..ఇక్కడ క్లిక్ చేయండి
* మీకు నిద్రలేమి సమస్య ఉందా? ఉంటే దాన్ని నివారించుకోవడానికి ఆరోగ్య సూత్రాలు ఇక్కడ క్లిక్ చేయండి
* సీఎం రేవంత్‌తో పట్నం మహేందర్‌రెడ్డి దంపతుల భేటీ ఇక్కడ క్లిక్ చేయండి
* తెలుగు రాష్ట్రాల ప్రజలకు హెచ్చరిక...నెల ముందే వచ్చేసిన వేసవి కాలం...ఇక్కడ క్లిక్ చేయండి
* పార్లమెంట్ ఎన్నికల తెలంగాణ ఓటర్ల జాబితా విడుదల ఇక్కడ క్లిక్ చేయండి 
* 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies