Type Here to Get Search Results !

Sports Ad

సీఎం రేవంత్‌తో పట్నం మహేందర్‌రెడ్డి దంపతుల భేటీ Patnam Mahender Reddy's couple met with CM Revanth

 సీఎం రేవంత్‌తో పట్నం మహేందర్‌రెడ్డి దంపతుల భేటీ

* వారం రోజుల్లో కాంగ్రెస్‌లో చేరతాం: సునీతారెడ్డి

* భారాసలోనే కొనసాగుతా : పట్నం నరేందర్‌రెడ్డి

హైదరాబాద్‌ Hyderabad News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా  తాండూరు మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఆయన సతీమణి, వికారాబాద్‌ జడ్పీ ఛైర్‌పర్సన్‌ సునీతారెడ్డి గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ఆయన నివాసంలో భేటీ అయ్యారు.రేవంత్‌కు పట్నం దంపతులు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సమావేశంలో మంత్రి దామోదర్‌ రాజనర్సింహ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి కుమారుడు రినీష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.మహేందర్‌రెడ్డితో పాటు తాను, తమ అనుచరవర్గం వారం రోజుల్లో కాంగ్రెస్‌లో చేరతామని సునీతారెడ్డి గురువారం రాత్రి 'న్యూస్‌టుడే'కు తెలిపారు. దిల్లీ లేదా హైదరాబాద్‌ వేదికగా పార్టీలో చేరాలా, జిల్లాలో బహిరంగ సభ నిర్వహించి చేరాలా అనే విషయమై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు.కాంగ్రెస్‌లో చేరడం మాత్రం ఖాయమని స్పష్టంచేశారు. శాసనసభ ఎన్నికలకు ముందే మహేందర్‌రెడ్డి, సునీతారెడ్డిలు కాంగ్రెస్‌లో చేరతారని ప్రచారం జరిగినా

      వారు భారాసలోనే కొనసాగారు. ఆ ఎన్నికల్లో తాండూరు భారాస టికెట్‌ను మహేందర్‌రెడ్డి ఆశించారు. అయితే అధిష్ఠానం రోహిత్‌రెడ్డికి టికెట్‌ కేటాయించింది. మహేందర్‌రెడ్డికి మంత్రి పదవి ఇచ్చింది. సునీతారెడ్డి కాంగ్రెస్‌ నుంచి చేవెళ్ల ఎంపీ టికెట్‌ ఆశిస్తున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.భారాసలోనే కొనసాగుతా పట్నం నరేందర్‌రెడ్డి మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, సునీతారెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసిన విషయం తాను మీడియాలో చూశానని, తనకు వారు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే, భారాస నేత పట్నం నరేందర్‌రెడ్డి తెలిపారు. రాజకీయాల్లో ఎవరి ఇష్టాలు వారివన్నారు. వారికి చేవెళ్ల ఎంపీ టికెట్‌ ఇస్తామని కాంగ్రెస్‌ నేతలు హామీ ఇచ్చినట్టు ఉందన్నారు. అందుకే సీఎంని కలిసి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. తాను మాత్రం భారాసలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరుదామని మహేందర్‌రెడ్డి తనతో చర్చించారని.. తాను తిరస్కరించానని చెప్పారు.

మరిన్ని వార్తల కోసం... 
* వచ్చే 14 నెలల్లో 30 ప్రయోగాలు, ఇక్కడ క్లిక్ చేయండి
* ఢిల్లీ సరిహద్దుల్లో మరోసారి రైతుల మహాధర్నా.. ఆపేందుకు హుటాహుటిన వెళ్లిన కేంద్ర మంత్రులు..ఇక్కడ క్లిక్ చేయండి
* మీకు నిద్రలేమి సమస్య ఉందా? ఉంటే దాన్ని నివారించుకోవడానికి ఆరోగ్య సూత్రాలు ఇక్కడ క్లిక్ చేయండి
* సీఎం రేవంత్‌తో పట్నం మహేందర్‌రెడ్డి దంపతుల భేటీ ఇక్కడ క్లిక్ చేయండి
* తెలుగు రాష్ట్రాల ప్రజలకు హెచ్చరిక...నెల ముందే వచ్చేసిన వేసవి కాలం...ఇక్కడ క్లిక్ చేయండి
* పార్లమెంట్ ఎన్నికల తెలంగాణ ఓటర్ల జాబితా విడుదల ఇక్కడ క్లిక్ చేయండి 
* 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies