40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి: గ్రేటర్ లో ఎండలు ఇప్పుడిప్పుడే మండిపోతున్నాయి. ఫిబ్రవరి మొదటి వారంలో నమోదైన పగటి ఉష్ణోగ్రతలతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మార్చినెల కాకముందే ఎండలు మండిపోతుండడంతో మార్చినెలలో పరిస్థితులు ఎలా ఉంటాయోనని ఆందోళన చెందుతున్నారు. గత మూడు రోజుల్లో భారీగా పెరిగిన పగటి ఉష్ణోగ్రతలతో గ్రేటర్‌వాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.జూబ్లీహిల్స్‌లో 38.4 డిగ్రీలు సరూర్‌నగర్, చందానగర్‌లో 38.3 డిగ్రీలు బేగంపేటలో 37.6 డిగ్రీలు ఉప్పల్‌లో 37.3 డిగ్రీలు శేరిలింగంపల్లిలో 37.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇప్పుడే ఎండలు ఈ స్థాయిలో ఉంటే ఏప్రిల్, మే నెలల్లో ఏ రేంజ్‌లో ఉంటాయోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.





