Type Here to Get Search Results !

Sports Ad

ఢిల్లీ సరిహద్దుల్లో మరోసారి రైతుల మహాధర్నా.. ఆపేందుకు హుటాహుటిన వెళ్లిన కేంద్ర మంత్రులు..Farmers' Mahadharna once again on the borders of Delhi.. Central ministers rushed to stop it..


 ఢిల్లీ సరిహద్దుల్లో మరోసారి రైతుల మహాధర్నా.. ఆపేందుకు హుటాహుటిన వెళ్లిన కేంద్ర మంత్రులు..

ఢిల్లీ Delhi News భారత్ ప్రతినిధి : పంజాబ్ రైతులు ఫిబ్రవరి 13, మంగళవారం ఢిల్లీ సరిహద్దుల్లో తలపెట్టిన మహాధర్నా నిరసనని అపేందుకు కేంద్ర మంత్రులు పియూష్ గోయల్, అర్జున్, నిత్యానంద రాయ్ చంఢీగడ్ తరలివెళ్లారు.అక్కడ రైతు నేతలతో పరిష్కారం కోసం చర్చలు జరుపుతారని సమాచారం. మూడేళ్ల క్రితం వ్యవసాయం చట్టాలను వ్యతిరేకిస్తూ.. పంజాబ్ రైతులు నెలల తరబరి చేసిన ధర్నా వల్ల మోదీ ప్రభుత్వం చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. మరో మూడు నెలల్లో లోక్ సభ ఎన్నికల దృష్ట్యా మరోసారి అలాంటి ధర్నా జరగకుండా ఉండేందుకు బీజేపీ మంత్రులు.. రైతుల వద్దకు చర్చలు జరిపేందుకు పరుగులు తీశారు.కనీస మద్దతు ధర కోసం ప్రత్యేక చట్టం, పంట బీమా, రైతు బీమాలు ప్రకటించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్లు కోసం ఢిల్లీ సరిహద్దులలో రైతులు ఫిబ్రవరి 13న రైతు ట్రాక్టర్ మార్చ్ నిరసన భారీ స్థాయిలో చేపట్టనున్నారు.అలాగే 2020లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేసిన ధర్నాలో రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఢిల్లీ-నోయిడా సరిహద్దులో రెండు రోజులుగా ఉత్తర ప్రదేశ్ రైతుల నిరసన జరుగుతోంది. ప్రభుత్వం తీసుకున్న తమ భూములకు బదులుగా పరిహారం పెంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం... 
* వచ్చే 14 నెలల్లో 30 ప్రయోగాలు, ఇక్కడ క్లిక్ చేయండి
* ఢిల్లీ సరిహద్దుల్లో మరోసారి రైతుల మహాధర్నా.. ఆపేందుకు హుటాహుటిన వెళ్లిన కేంద్ర మంత్రులు..ఇక్కడ క్లిక్ చేయండి
* మీకు నిద్రలేమి సమస్య ఉందా? ఉంటే దాన్ని నివారించుకోవడానికి ఆరోగ్య సూత్రాలు ఇక్కడ క్లిక్ చేయండి
* సీఎం రేవంత్‌తో పట్నం మహేందర్‌రెడ్డి దంపతుల భేటీ ఇక్కడ క్లిక్ చేయండి
* తెలుగు రాష్ట్రాల ప్రజలకు హెచ్చరిక...నెల ముందే వచ్చేసిన వేసవి కాలం...ఇక్కడ క్లిక్ చేయండి
* పార్లమెంట్ ఎన్నికల తెలంగాణ ఓటర్ల జాబితా విడుదల ఇక్కడ క్లిక్ చేయండి 
* 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies