గ్రూప్-4 ఫలితాలు విడుదల
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : తెలంగాణలో గ్రూప్-4 ఉద్యోగ నియామక పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.అభ్యర్థుల ర్యాంకుల వివరాలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) శుక్రవారం రాత్రి వెల్లడించింది. అభ్యర్థులు తమ అధికారిక వెబ్‌సైట్‌లో ర్యాంకులు చూసుకోవాలని సూచించింది. ధ్రువపత్రాల వెరిఫికేషన్‌కు ఎంపికైన వారి వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపింది. తెలంగాణలో గ్రూప్-4 సర్వీసుల్లో 8,180 పోస్టుల భర్తీకి సంబంధించి రాత పరీక్ష (పేపర్-1, పేపర్-2) జులై 1న నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 9,51,321 మంది దరఖాస్తు చేసుకోగా.. 80శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు.





