జిల్లా నిరుద్యోగులకు గుడ్ న్యూస్..!
* తాండూరు నర్సింగ్ కాలేజీలో పోస్టులు
* ఎల్లుండి నుంచే దరఖాస్తుల స్వీకరణ
* ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేయాలంటే.?
తాండూరు Tandur News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలోని నిరుద్యోగులకు ప్రభుత్వ అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. జిల్లాలోని తాండూరులో నిర్వహిస్తున్న నర్సింగ్ కాలేజీలో పలు పోస్టులను భర్తి చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు. నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపల్ ఎం.విజయ కుమారి ఓ ప్రకటనలో పోస్టుల వివవరాలు, అభ్యర్థుల అర్హత, దరఖాస్తు విధానాన్ని వెల్లడించారు. తాండూరు పట్టణ కేంద్రంలో నిర్వహిస్తున్న నర్సింగ్ కళాశాలలో 2 డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులుగా ఉండగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లమా అండ్ కంప్యూటర్ అప్లికేషన్ లేదా బ్యాచిలర్ ఇన్ కంప్యూటర్ సైన్స్ విద్యా అర్హత కలిగి ఉండాలని తెలిపారు.2 రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు, 4 హౌస్ కీపర్ 4 పోస్టులకు డిగ్రీ అర్హత ఉండాలన్నారు. 1 అసిస్టెంట్ లైబ్రరీ పోస్టుకు డిగ్రీ లేదా డిప్లమా ఇన్ లైబ్రరీ సైన్స్ చదివి ఉండాలన్నారు. 6 ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు, 5 ల్యాబ్ అటెండెంట్ పోస్టులు, 3 లైబ్రెరి అటెండెంట్ పోస్టులకు పదవ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలని స్పష్టం చేశారు.
1 హెవీ వెహికల్ డ్రైవర్ పోస్టుకు పదవ తరగతి చదివి హెవీ వెహికల్ లైసెన్స్ కలిగి ఉండాలని, అదేవిధంగా డ్రైవర్ 1 పోస్టుకు పదవ తరగతి ఉత్తీర్ణత తో పాటు ఫోర్ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని తెలిపారు. మరో పోస్టుకు ఐటిఐ ఎలక్ట్రానిక్స్ లేదా డిప్లమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఉత్తీర్ణత కలిగి అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని ఆమె పేర్కొన్నారు. పై పోస్టలకు సంబంధించి 18 సంవత్సరాల నుండి 43 సంవత్సరాలు వయసు కలిగిఉండాలన్నారు.ముఖ్యంగా అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లతో రెండు జతల దరఖాస్తును ఈనెల 12 నుండి 17 వరకు ప్రభుత్వ నర్సింగ్ కళాశాల తాండూర్ నందు సమర్పించాల్సిందిగా ఆమె తెలిపారు. మిగతా పూర్తి వివరాలకు సెల్ : 9948176126 ను సంప్రదించాలని సూచించారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవవాలని సూచించారు.



.webp)

