Type Here to Get Search Results !

Sports Ad

విదేశాల్లో ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ A dedicated helpline for students abroad


 విదేశాల్లో ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ 

హైదరాబాద్‌ Hyderabad News భారత్ ప్రతినిధి: అమెరికా సహా ఇతర దేశాల్లో నివసిస్తోన్న తెలంగాణ విద్యార్థులు యువత కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి  తెలిపారు. చికాగోలో హైదరాబాద్‌ విద్యార్థి సయ్యద్‌ మజాహిర్‌పై దాడి ఒహియోలో శ్రేయాస్‌రెడ్డి హత్య కలవర పెడుతున్నాయని సీఎం ట్వీట్‌ చేశారు. తమ ఆందోళనను అమెరికాకు తెలపాలని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ను కోరారు. తెలంగాణ ప్రజలు ఈ భూమిపై ఎక్కడ ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం పేర్కొన్నారు.        

      అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లిన హైదరాబాద్‌ విద్యార్థి  సయ్యద్‌ మజాహిర్‌ అలీపై దాడి జరిగిన విషయం తెలిసిందే. మంగళవారం రాత్రి అతడు హోటల్ నుంచి ఇంటికెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు. తల, ముక్కు, కళ్లపై గాయాలయ్యాయి. తనపై జరిగిన దాడిని వీడియో ద్వారా వెల్లడించాడు. తనకు సాయం చేయాలని భారత ప్రభుత్వాన్ని అగ్రరాజ్యంలోని మన దౌత్య సిబ్బందిని అభ్యర్థించారు. దీంతో అతడి పరిస్థితిపై హైదరాబాద్‌లో ఉంటున్న కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తన భర్తకు సాయం చేయాలంటూ అలీభార్య ఫాతిమా రిజ్వి జైశంకర్‌కు లేఖరాశారు. ఈనేపథ్యంలో సీఎం స్పందించారు.

మరిన్ని వార్తల కోసం... 
* విదేశాల్లో ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ ఇక్కడ క్లిక్ చేయండి
* నేడు ధరణిపై మధ్యంతర నివేదిక ఇక్కడ క్లిక్ చేయండి
* కానిస్టేబుల్ ఉద్యోగాలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్కా ఇక్కడ క్లిక్ చేయండి
* త్వరలో మరో రెండు గ్యారెంటీలు అమలు చేస్తాం గవర్నర్ ఇక్కడ క్లిక్ చేయండి
* రేషన్‌కార్డు ఉంటేనే ఉచిత కరెంటు? ఇంటింటికి వెళ్లి కనెక్షన్ల వివరాలు సేకరిస్తున్న సిబ్బంది ఇక్కడ క్లిక్ చేయండి
* గుంత బాచుపల్లి కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్ ఏర్పుల అంబన్న ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies