రైతు బీమా దరఖాస్తుకు వేళాయె ఆగస్టు 5వ తేదీ వరకు అవకాశం
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. రైతు అకాల మరణం లేదా సహజ మరణం చెందితే ఆయన కుటుంబం వీధిన పడొద్దనే ఉద్దేశంతో సర్కారు ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ప్రభుత్వమే జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ)కు ప్రీమియం చెల్లించి మృతి చెందిన రైతు కుటుంబాలకు ప్రమాద బీమా సొమ్మును అందిస్తోంది. ఏటా ప్రభుత్వమే రెన్యూవల్ చేస్తోంది.
ఈ సంవత్సరం జూన్ 28 వరకు పట్టాదారు పాసుపుస్తకం కలిగి ఉన్నవారు కొత్తగా రైతు బీమాకు దరఖాస్తు చేసుకునేందుకు ఆగస్టు 5వ తేదీ వరకు అవకాశం కల్పించింది. గతంలో దరఖాస్తు చేసుకున్న రైతులు తమ ఆధార్, బ్యాంకు ఖాతాలో మార్పులు, లేదా నామిని చనిపోతే పేరు మార్పు కోసం ఈనెల 30 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
చేయాల్సింది ఇలా....
వ్యవసాయ భూమి కొనుగోలు చేసినా లేక తమ పేరిట భూమి మార్పిడి చేసుకున్న వ్యవసాయ భూమిని ధరణిలో పట్టా చేయించుకున్న రైతులు 18 ఏళ్ల నుంచి 59 ఏళ్లలోపు వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. 1965 ఆగస్టు 14 నుంచి 2006 ఆగస్టు 14 మధ్యలో జన్మించిన రైతులు అర్హులు. పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డు, నామిని ఆధార్ జిరాక్స్ ప్రతులతో కలిపి రైతు బీమా ఫారంలో వివరాలు నమోదు చేసి పట్టాదారు స్వయంగా సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈవో)కి అందజేసి నమోదు చేయించుకోవాలి.
The Rythu Bima plot executed by the state government upholds the groups of rice contributors. The public authority has carried this plan to guarantee that the rancher's family doesn't wind up in the city in the event of unexpected passing or normal demise. The public authority pays the charge to the Extra security Organization (LIC) and gives mishap protection to the groups of the departed ranchers. The public authority restores it consistently.
This year, the holders of Pattadaru passbook till June 28 have been offered the chance till August 5 to apply for the new Rythu Bima. Ranchers who applied before need to apply till 30th of this current month for changes in their Aadhaar, changes in ledger or name change in the event of death.
Ranchers between 18 to 59 years old who have bought agrarian land or have rural land moved in their name and who have enlisted in Dharani ought to apply. Ranchers brought into the world between August 14, 1965 to August 14, 2006 are qualified. The alumni ought to enter the subtleties in the rancher's protection structure alongside the pass book, Aadhaar card and xerox duplicates of the candidate's Aadhaar and submit it to the concerned Agrarian Augmentation Official (AEO) for enlistment.