కొత్త ఫోన్ కొని ఫ్రెండ్స్ చేతిలో చనిపోయాడు ఎందుకంటే
జాతీయ National News భారత్ ప్రతినిధి : దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కొత్త మొబైల్ ఫోన్ కొని పార్టీ ఇవ్వలేదనే కోపం ఓ యువకుడిని అతడి ఫ్రెండ్సే దారుణంగా కత్తితో పొడిచి హత్య చేశారు. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలోని షకర్‌పూర్ ప్రాంతానికి చెందిన సచిన్ (16) అనే యువకుడు నిన్న (సెప్టెంబర్ 23) కొత్త మొబైల్ ఫోన్ కొనుగోలు చేశాడు. కొత్త ఫోన్ కొన్న సందర్భంగా పార్టీ ఇవ్వాలని సచిన్‌ను ఫ్రెండ్స్ కోరగా ట్రీట్ ఇచ్చేందుకు అతడు నిరాకరించాడు.
తన దగ్గర డబ్బులు లేవని ఇప్పుడు పార్టీ ఇవ్వనని ఫ్రెండ్స్‌కు తేల్చి చెప్పాడు. దీంతో పార్టీ విషయంలో సచిన్‌కు అతడి ఫ్రెండ్స్ మధ్య మాట మాటపెరిగి చివరకు ఘర్షణకు దారి తీసింది. తీవ్ర ఆగ్రహానికి లోనైన యువకులు సచిన్‌ను కత్తితో పొడిచి పరారయ్యారు. గమనించిన స్థానికులు సచిన్‌ను ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించించారు. స్నేహితుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ సచిన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఈ ఘటనపై మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. పార్టీ విషయంలో గొడవ జరగడంతోనే సచిన్‌పై అతడి స్నేహితులు కత్తి దాడి చేశారని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నామని ఘటన స్థలంలో సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని వెల్లడించారు.
A shocking incident took place in the national capital, Delhi. A young man was brutally stabbed to death by his friends because he was not given a party after buying a new mobile phone. According to the details of the police regarding this shocking incident, a youth named Sachin (16) from Shakarpur area of Delhi yesterday (September 23) bought a new mobile phone.
He told his friends that he will not give a party now that he has no money. Due to this, Sachin's friends started talking about the party and finally it led to a fight. The enraged youth stabbed Sachin and ran away. Locals who noticed Sachin took him to the hospital and informed the police.
According to the complaint of the family members of the deceased, the police have registered a case and are investigating the incident. According to the police, preliminary investigation has revealed that Sachin's friends attacked him with a knife due to a quarrel about the party. He said that the weapon used in the murder has been recovered.