Type Here to Get Search Results !

తాండూర్ టిడిపి ఎమ్మెల్యే టికెట్ అందుకున్న శ్రీనివాస్ Srinivas got Tandur TDP MLA ticket


 తాండూర్ టిడిపి ఎమ్మెల్యే టికెట్ అందుకున్న శ్రీనివాస్ 

తాండూర్ Tandur News భారత్ ప్రతినిధి :  తెలంగాణలో పోటీకి దూరం అనడంతో ఆయన ఎవరికి సపోర్ట్ చేయబోతున్నారు కార్యకర్తల నుండి ఒత్తిడి ఆయన అడుగులు ఎటు తాండూర్ టిడిపి ఎమ్మెల్యే టికెట్ శ్రీనివాస్ గారికి ఖరారైన విషయం తెలిసిందే తెలంగాణలో పోటీకి దూరం అనడంతో ఇండిపెండెంట్ గా వేస్తారా ఎటు మరి ఆయన అడుగులు తాండూర్ నియోజకవర్గంలో కొన్ని సంవత్సరాలుగా పార్టీకి సేవలందిస్తు 2018లో తాండూర్ నియోజకవర్గంలో టిడిపిని విడిచి అందరు వెళ్లిన పార్టీలోనే ఉంటు నియోజకవర్గంలో అన్ని తానై పార్టీని కాపాడుతున్న విషయం తెలిసిందే ముఖ్యంగా చూసినట్లయితే చిన్ననాటి నుండి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అభిమానిగా 2005లో సొంత గ్రామం కొర్విచెడ్ లో శ్రీనివాస్ వాళ్ళ ఫ్యామిలీలో టిడిపి సర్పంచుగా వాళ్ళ వదిన ఘన విజయం సాధించడంలో శ్రీనివాస్ వాళ్ళ నాన్నగారు ఎంతో కష్టపడి గెలిపించారు. అంతకుముందే టిడిపి కుటుంబంగా పేరు ఉంది రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న ఎల్.రమణ రేవంత్ రెడ్డి 

       ఆధ్వర్యంలో పూర్తిగా రాజకీయాలకి వచ్చి నియోజకవర్గంలో కట్టుబడి పనిచేస్తూ తాండూర్ ఇన్చార్జిగా ఉన్న రాజు గౌడ్ తో పాటు నియోజకవర్గంలో ప్రతి సమస్యపై ధర్నా రాస్తారోకోరలు ప్రజా సమస్యలపై పోరాడుతూ టిడిపి కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ బషీరాబాద్ మండల్ తెలుగు యువత అధ్యక్షులుగా మరియు బషీరాబాద్ మండల్ అధ్యక్షులుగా 2018 నుండి నియోజకవర్గ బాధ్యులుగా చేవెళ్ల పార్లమెంట్ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. 2018 ఎన్నికలు రాగా ఆ ఎన్నికల్లో టిడిపి కాంగ్రెస్ పొత్తు కావడంతో పైలెట్ రోహిత్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ రావడం జరిగింది. టిడిపి ఇన్చార్జిగా ఉన్న రాజు గౌడ్ తో పాటు అందరు పార్టీని విడిచి వెళ్లారు. శ్రీనివాస్ గారికి కూడా అవాలని అవకాశం వచ్చిన  అందరు వెళ్లిన నేను టీడీపీ లోనే కొనసాగుతానంటూ అన్నారు. ఆరోజు శ్రీనివాస్ ఆయన టీం తో టిడిపి కాంగ్రెస్ పొత్తులో పైలట్ రోహిత్ రెడ్డి గెలుపు కోసం ఊరు ఊరు  తిరిగి ఆయన గెలుపు కోసం కృషి చేశారు. చూస్తుండగా 2019 లో    జెడ్పిటిసి ఎన్నికలు రాగా ఆ ఎన్నికల్లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కాక  బషీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీశైల్ రెడ్డి  

       మంత్రి మహేందర్ రెడ్డి అనుచరుడు టిఆర్ఎస్ అభ్యర్థి మీరాణం శ్రీనివాస్ రెడ్డి  టిడిపి అభ్యర్థిగా ఎం శ్రీనివాస్ బరిలో నిలిచి ఊరురా తిరిగి గట్టి పోటీ ఇచ్చారు. ఆశించినంత ఫలితం రాలేదు ఏరోజు కూడా పార్టీ ఆదుకోకపోయినా ఏ మాత్రం నిరాశ చెందకుండా పార్టీకి కట్టుబడి కార్యక్రమాలు  నిర్వహిస్తూ అధికార పార్టీ అవినీతిని ప్రశ్నిస్తూ వస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన దేశాల మేరకు ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్ లో కార్యక్రమాల్లో పాల్గొంటూ మరి అంతే కాకుండాయువత మార్పు కోసం యూత్ ప్రభంజనం అనే సంస్థ స్థాపించి పేదప్రజల పెళ్లిళ్లకు  బియ్యo చనిపోతే కొంత ఆర్థిక సాయం చేస్తూ మరి నిరుపేదలకు సాయం చేస్తూ వస్తున్నారు. తాండూర్ టిడిపి ఎమ్మెల్యేగా రాష్ట్ర నాయకత్వం లిస్ట్ ఖరారు చేయగా తెలంగాణలో పోటీకి దూరం అనడంతో ఆలోచనలో పడ్డ శ్రీనివాస్ అందరు కార్యకర్తలు అభిమానులతో ఫోన్లో ద్వారా చర్చలు జరుపుతున్నారు. ఇండిపెండెంట్ గా పోటీ చేయాల్నా ఎవరికైనా మద్దతు ఇయ్యాల్నా పార్టీ   మారలన ఆయన తొందరలోనే సమావేశం ఏర్పాటు చేయనున్నారు. తప్పి పార్టీ మారితే అన్ని మండలాల పార్టీ నాయకులు కార్యకర్తలు యువకులతో పాటు 8నుండి 10మంది మాజీ సర్పంచులు ఎంపిటిసిలుతోవార్డ్ నెంబర్లను మాట్లాడి సిద్ధం చేసినట్లు సమాచారం.

మరిన్ని వార్తల కోసం... 
* జోరుగా కొనసాగుతున్న బిఆర్ఎస్ పార్టీ ప్రచారం ఇక్కడ క్లిక్ చేయండి
* పదో తరగతి వార్షిక పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల ఇక్కడ క్లిక్ చేయండి
* ఖమ్మం జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య? ఇక్కడ క్లిక్ చేయండి
* ఇంటర్ పాసైతే చాలు..సర్కార్ కొలువు మీదే..జీతం నెలకు రూ.80వేలు..వివరాలివే..!! ఇక్కడ క్లిక్ చేయండి
* గుండె ఆరోగ్యానికి, బరువు తగ్గటానికి.. బ్లాక్ టీ పర్​ఫెక్ట్.. ఇక్కడ క్లిక్ చేయండి
* నేటి నుండి తెలంగాణ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ షురూ! ఇక్కడ క్లిక్ చేయండి
* కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎక్మయి గ్రామస్థులు ఇక్కడ క్లిక్ చేయండి 

* తాండూర్ టిడిపి ఎమ్మెల్యే టికెట్ అందుకున్న శ్రీనివాస్ ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies