పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తినడానికి మారం చేస్తున్నారా అయితే ఇవి ట్రై చేయండి
ఆరోగ్యం Health News భారత్ ప్రతినిధి : ఓ పక్క స్కూలుకు టైం అయిపోతుంది అబ్బబ్బ ఈ పిల్లలకు పొద్దున్నే బ్రేక్ ఫాస్ట్ తినిపించాలంటే తల ప్రాణం తోకకు వస్తుందని అమ్మలు పడే బాధలు అన్నీ ఇన్నీ కావు. తల్లులకు అదొక పెద్ద టాస్క్ అనే చెప్పాలి. రెండు దోసెలు రెండు ఇడ్లీలు తినడానికి ఎంతో మారాం చేస్తూ ఉంటారు. ఇక, నచ్చని ఫుడ్ అయితే నోరు కూడా తెరవరు. కాని కొంతమంది అమ్మలు బలవంతంగా తినిపిస్తూ ఉంటారు. ఇలా బలవంతంగా తినిపించాలని చూస్తే తిన్నది కూడా వాంతి చేసేసుకుంటారు.
పిల్లలు సరిగ్గా తినకపోతే వారికి సరిగ్గా పోషకాలు అందవు. చిన్నారుల ఎదుగుదల పైనా ప్రభావం పడుతుంది. మీ పిల్లలు ఎంజాయ్ చేసేలా, మీకూ ప్రయాస లేకుండా ఎలాంటి బ్రేక్ ఫాస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారో తెలుసుకుందాం. ఉదయాన్నే స్కూలుకు వెళ్లే పిల్లలకు టిఫిన్ తినిపించడం తల్లులకు తలకుమించిన భారం, రెగ్యులర్ ఫుడ్ పెడితే ఎవరైనా ఎలా తింటారు చెప్పండి. బోర్ కొట్టేస్తుంది. అందుకే ఉదయాన్నే పిల్లలకు పెట్టే అల్పాహారం మిల్లెట్స్ తో వెరైటీగా ఇలా ప్రిపేర్ చేయండి. లొట్టలేసుకుంటూ లాగించేస్తారు.
జొన్న దోశెల తయారికీ కావలసినవి....
జొన్నలు : రెండు కప్పులు
మినపప్పు : కప్పున్నర
బియ్యం: అరకప్పు
వంటసోడా : అరటీస్పూన్
ఉప్పు : సరిపడా
నూనె : అరకప్పు
అల్లం, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి (తరిగినవి) : ఒక కప్పు (అన్నీ కలిపి)
జీలకర్ర: ఒక టీస్పూన్
తయారీ విధానం : ఆరుగంటల ముందు జొన్నలు, మినపప్పు ,బియ్యం విడివిడిగా నానబెట్టాలి. ఇవి బాగా నానిన తర్వాత నీళ్లు వంపేసి మెత్తగా రుబ్బాలి. దీనిలో ఉప్పు కలిపి రాత్రంతా పక్కనబెట్టాలి. ఇలా చేస్తే పిండి బాగా పులుస్తుంది. అప్పుడు దోశెలు బాగా వస్తాయి. ఒకవేళ పిండి గట్టిపడితే.. సరిపడా నీళ్లు కలుపుకొని వంట సోడా వేయాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి కాసింత నూనె చల్లి దోస పోసి దాని మీద జిలకర, ఉల్లిపాయముక్కలు, మిర్చి, అల్లం ముక్కలు చల్లాలి. కావాలంటే ప్లెయిన్ దోశ కూడా వేయొచ్చు. దోశ చుట్టూ నూనె వేసి దోరగా కాల్చాలి. కావాలంటే పచ్చడితో తినొచ్చు. ఉట్టిదే తిన్నాగాని టేస్టీగా ఉంటుంది.
క్యారెట్ ఇడ్లీ తయారీకి కావలసినవి....
ఇడ్లీ రవ్వ -: పావుకేజీ
క్యారెట్ : రెండు
కొత్తిమీర తరుగు :- ఒక కప్పు
పచ్చిమిర్చి పేస్ట్ : ఒక టేబుల్ స్పూన్
ఉప్పు : సరిపడా
మినపప్పు : వంద గ్రాములు
తయారీ విధానం : మినపప్పు నానబెట్టి పిండి రుబ్బుకోవాలి, క్యారెటీ ను సన్నగా తురిమీ పక్కకు పెట్టాలి. రుబ్బిన పిండిలో నీళ్లు పిండిన ఇడ్లీ రవ్వ, కొత్తిమీర, ఉప్పు, మిర్చి పేస్టు, క్యారెట్ తురుము, సోడా వేయాలి. ఇలా అన్నీ కలిపిన తర్వాత రెండు గంటలు పక్కకు పెట్టాలి. స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టి ఇడ్లీలు వేయాలి. పది నిమిషాల్లో క్యారెట్ ఇడ్లీ రెడీ. ఆరెంజ్ కలర్ పట్టుకుంటాయి. పిల్లలను నోరూరిస్తాయి.
రాగి దోశె తయారీకి కావలసినవి....
మినపప్పు : ఒక కప్పు
బియ్యం : ఒక కప్పు
రాగిపిండి : రెండు కప్పులు
పర్చిమిర్చి : రెండు
ఉల్లిపాయలు : రెండు
జీలకర్ర : టేబుల్ స్పూన్
అల్లం : చిన్న ముక్క
ఉప్పు : సరిపడా
తయారీ విధానం : మినపప్పును, బియ్యాన్ని ఒకరోజు ముందే విడివి డిగా నానబెట్టాలి. మినప పప్పు బాగా కడిగి నాన బెట్టిన బియ్యంతో పాటు కలిపి మెత్తగా రుబ్బాలి. దోశ వేయడానికి అనువుగా ఉండేలా పిండి రుబ్బిన తర్వాత రాగిపిండి, ఉప్పు కలిపి నాలుగు గంటలు నానబెట్టాలి. ఇప్పుడు ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, జీలకర్ర అన్నీ వేసి బాగా కలపాలి. పొయ్యి మీద పెనం పెట్టి కాస్తంత నూనె వేసి కావాల్సిన సైజులో దోశె పోయాలి. అల్లం పచ్చడి, కొబ్బరి పచ్చడి కాంబినేషన్లో తింటే టేస్టీగా ఉంటాయి ఈ దోశెలు.
రాగి ఇడ్లీ తయారీకి కావలసినవి....
మినపప్పు : వంద గ్రాములు
బియ్యం రవ్వ : వంద గ్రాములు
రాగిపిండి : వంద గ్రాములు
ఉప్పు : తగినంత
తయారీ విధానం : మినపప్పును ఐదు గంటలు నానబెట్టాలి ఆ తర్వాత బాగా కడిగి మెత్తగా రుబ్బాలి. ఇందులో రాగిపిండి, నీళ్లు ఒంపిన బియ్యం రవ్వ కలిపి ఐదు గంటల పాటు పక్కకు పెట్టాలి. ఈ పిండిలో కాస్త ఉప్పు సోడా కలిపి ఇడ్లీ పాత్రలో ఇడ్లీలు వేయాలి. బాగా ఉడికిన తర్వాత దించేసి పల్లీ చట్నీ, అల్లం చట్నీలో నంజుకుని తింటే టేస్ట్ ప్లస్ హెల్త్ మీ సొంతం.
On the other hand, the time for school is running out. This is not all the pains mothers go through to feed these children an early breakfast. It must be said that it is a big task for mothers. They do a lot of maram to eat two dosas and two idlis. Also, they don't even open their mouths if they don't like food. But some mothers force-feed. If they try to force feed like this, they will vomit even what they have eaten.
If children do not eat properly they will not get proper nutrients. It also affects the growth of children. Let's find out what kind of breakfast you can make so that your children enjoy it and you can eat it without any effort. Feeding tiffin to children who go to school early in the morning is a burden for mothers, tell me how anyone eats regular food. Boring. That's why prepare the breakfast for children in the morning as a variety with millets.





