Type Here to Get Search Results !

Sports Ad

10 ఏళ్లుగా సిగరెట్లు తాగుతున్నారా అర్జంట్‎గా ఈ 5 పరీక్షలు చేయించుకోండి If You Have Been Smoking Cigarettes For 10 Years Do These 5 Tests As A Matter Of Urgency

 10 ఏళ్లుగా సిగరెట్లు తాగుతున్నారా అర్జంట్‎గా ఈ 5 పరీక్షలు చేయించుకోండి

ఆరోగ్యం Health News భారత్ ప్రతినిధి : మీరు సిగరెట్లు తాగుతున్నారా స్మోకింగ్ చేస్తున్నారా అది కూడా పదేళ్లుగా తాగుతున్నారా అయితే అర్జంట్ గా ఈ ఐదు పరీక్షలు చేయించుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవల కాలంలో స్మోకింగ్ వల్ల అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయని మారిన ఆహారపు అలవాట్లు శారీరక శ్రమ లేకపోవటం కూర్చుని చేసే ఉద్యోగాల వల్ల స్మోకింగ్ ఎఫెక్ట్ శరీరంపై ఎక్కువగా ప్రభావం చూపిస్తుందని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే వెంటనే ఈ ఐదు పరీక్షలు చేయించుకోవాలని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

1. చెస్ట్ ఎక్స్-రే....

ఊపిరితిత్తుల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి చెస్ట్ ఎక్స్ రే కంపల్సరీ అంటున్నారు వైద్యులు. ఈ ఎక్స్ రే వలన ఊపిరితిత్తుల ఎలా పని చేస్తున్నాయి ఏమైనా ఇన్ఫెక్షన్లు ఉన్నాయా అనే విషయాలు వెల్లడవుతాని చెబుతున్నారు. క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD), ఎంఫిసెమా మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి అసాధారణతలను గుర్తించడంలో సహాయపడుతుండుందంటున్నారు నిపుణులు. తద్వారా సత్వర చికిత్స తీసుకుని వ్యాధి నయం చేసుకోవచ్చు. 

2. ఊపిరితిత్తుల పనితీరు పరీక్ష (స్పిరోమెట్రీ)....

స్పిరోమెట్రీ పరీక్ష అంటే మీ ఊపిరితిత్తులు ఎంత బాగా పని చేస్తున్నాయో అంచనా వేయడం.  దీని ద్వారా మీ ఊపిరితిత్తుల పనితీరు తెలుసుకోవచ్చు. ధూమపానం చేసేవారిలో ఎక్కువగా కనిపించే ఉబ్బసం,  సీవోపీడీ వంటి పరిస్థితులను నిర్ధారించడానికి ఈ పరీక్ష ముఖ్యమైనది. ఇది ఊపిరితిత్తుల వ్యాధుల పురోగతిని, ఏవైనా చికిత్సల ప్రభావాన్ని ట్రాక్ చేయడంలో కూడా సహాయపడుతుంది.

3. ఊపిరితిత్తుల CT స్కాన్....

ఊపిరితిత్తుల CT స్కాన్ ద్వారా ఎక్స్ రేతో పోలిస్తే మరింత వివరంగా, క్లారిటీ ఊపిరితిత్తుల పనితీరు తెలుసుకోవచ్చు. అధిక దూమపానం చేసే అలవాటు ఉన్నవారు ఈ పరీక్ష చేసుకోవడం బెస్ట్ అంటున్నారు నిపుణులు. దీని ద్వారా ఊపిరితిత్తుల క్యాన్సర్, ఇతర తీవ్రమైన పరిస్థితులను ముందుగానే గుర్తించడంలో సహాయపడుతుందంటున్నారు వైద్యులు.

4. రక్త పరీక్షలు....

సాధారణ రక్త పరీక్షలు మొత్తం ఆరోగ్యాన్ని పర్యవేక్షించడంతో పాటు ధూమపానానికి సంబంధించిన సమస్యలను గుర్తించడంలో సహాయపడతాయి. ఇందులో మరి కొన్ని రకాల పరీక్షలు ఉన్నాయి. మొత్తం ఆరోగ్యాన్ని అంచనా వేయడంతో పాటు రక్తహీనత, =ఇన్ఫెక్షన్‌ల వంటి పరిస్థితులను గుర్తిస్తుంది కంప్లీట్ బ్లడ్ కౌంట్ పరీక్ష ధూమపానం చేసేవారిలో పెరిగిన గుండె జబ్బుల ప్రమాదాన్ని అంచనా వేయడానికి,  కొలెస్ట్రాల్ స్థాయిలను కొలవడానికి లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష.

5. హార్ట్ హెల్త్ స్క్రీనింగ్....

ధూమపానం చేసేవారికి హృదయ సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందంటున్నారు హెల్త్ ఎక్స్ పర్ట్స్. రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు, ఎలక్ట్రో కార్డియోగ్రామ్ (ECG) కోసం రెగ్యులర్ స్క్రీనింగ్‌లు గుండె ఆరోగ్యాన్ని పర్యవేక్షించడంలో సహాయపడతాయి. హైపర్‌టెన్షన్, కరోనరీ ఆర్టరీ డిసీజ్, క్రమరహిత గుండె లయలు వంటి సమస్యలను ముందుగానే హార్ట్ హెల్త్ స్క్రీనింగ్ గుర్తించవచ్చు.

If you are a smoker or have been smoking for ten years, health experts suggest that you undergo these five tests as a matter of urgency. It is warned that the health problems caused by smoking are increasing in recent times, the changed eating habits, the lack of physical activity, and the smoking effect has a greater impact on the body due to sitting jobs. In this order, health experts warn to undergo these five tests immediately.

మరిన్ని వార్తల కోసం.... 
* మైనర్లు​ డ్రైవింగ్ చేయొద్దు ఇక్కడ క్లిక్ చేయండి
*  మంగళ్ హాట్ ఠాణాలో గణేశ్ విగ్రహాల ధ్వంసం ఇక్కడ క్లిక్ చేయండి
* వాల్నట్స్ నానబెట్టి తినాలా డైరెక్ట్ గా తినకూడదా ఇక్కడ క్లిక్ చేయండి
* రేపో ఎల్లుండో టెలిగ్రామ్ యాప్ బ్యాన్ నిషేధానికి కారణాలు ఇవే ఇక్కడ క్లిక్ చేయండి
* సెప్టెంబరులో భారీగా సెలవులు విద్యార్థులకు ఉద్యోగులకి కూడా ఇక్కడ క్లిక్ చేయండి
* మహిళలు స్నానానికి వేడి నీళ్లు మంచివా చల్లటి నీళ్లు మంచివా ఇక్కడ క్లిక్ చేయండి
* బిగ్ బాస్ కంటెస్టెంట్లకు విజేతలకు రెమ్యునరేషన్ ఏ రేంజ్లో ఇస్తారు ఇక్కడ క్లిక్ చేయండి
* పిల్లలు బ్రేక్​ ఫాస్ట్​ తినడానికి మారం చేస్తున్నారా అయితే ఇవి ట్రై చేయండి ఇక్కడ క్లిక్ చేయండి
* రుణమాఫీ కాని రైతులకు గుడ్‌న్యూస్ అందుబాటులోకి యాప్ ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies