Type Here to Get Search Results !

Sports Ad

రేపో ఎల్లుండో టెలిగ్రామ్ యాప్ బ్యాన్ నిషేధానికి కారణాలు ఇవే These Are The Reasons Behind Repo Ellundo Telegram App Ban

 రేపో ఎల్లుండో టెలిగ్రామ్ యాప్ బ్యాన్ నిషేధానికి కారణాలు ఇవే

జాతీయ National News భారత్ ప్రతినిధి : టెలిగ్రామ్ యాప్ ఇండియాలో బ్యాన్ కాబోతున్నది. ఈ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ఇండియా సైబర్ క్రైం కో ఆర్డినేషన్ సెంటర్ విచారణ చేస్తుంది. టెలిగ్రాం సీఈవో పావెల్ ను ఫ్రాన్స్ ప్రభుత్వం అరెస్ట్ చేయటంతో ఈ ఇష్యూపై ప్రపంచం మొత్తం దృష్టి పెట్టింది. టెలిగ్రామ్ యాప్ ను బ్యాన్ చేయాలనే ఆలోచన చాలా దేశాలు చేస్తున్నాయి. అందులో భారత్ ఒకటి. అసలు టెలిగ్రాం యాప్ బ్యాన్ చేయటానికి కారణాలు ఏంటీ. ఎందుకు బ్యాన్ చేయాలి అని అనుకుంటున్నారో వివరంగా తెలుసుకుందాం.

అశ్లీలతకు అడ్డా హనీట్రాప్ కు మోనార్క్....  
టెలిగ్రామ్ యాప్ లో ఎక్కువ అశ్లీలత వీడియోలు చైల్డ్ పోర్న్ కంటెంట్ ఉందని నిర్థారించింది ఇండియా సైబర్ క్రైం కో ఆర్డినేషన్ సెంటర్ నిర్థారించింది. అదే విధంగా మహిళల అక్రమ రవాణాకు హనీట్రాప్ కు అడ్డాగా మాఫియా ఉపయోగించుకుంటుంది. ఇలాంటి కంటెంట్ను తొలగించటంలో టెలిగ్రామ్ యాప్ విఫలమైంది. ఆయా దేశాలు, భారతదేశ చట్టాలకు విరుద్ధంగా ఉన్న కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇదే విషయంపై ఫ్రాన్స్ దేశం టెలిగ్రామ్ సీఈవో పావెల్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తుంది. భారత్ సైతం ఇప్పుడు టెలిగ్రామ్ యాప్ బ్యాన్ చేయాలనే ఆలోచనకు వచ్చింది. 

పరీక్ష పేపర్ల లీక్....
మన దేశంలో ఇటీవల పరీక్ష పేపర్ల లీక్ అంతా మొదట టెలిగ్రామ్ నుంచే బయటపడింది. మే 5వ తేదీ జరిగిన నీట్ ఎగ్జామ్ పేపర్ సైతం ఈ యాప్ నుంచే అందరికీ షేర్ అయ్యింది. అదే విధంగా జార్ఖండ్, రాజస్తాన్, బీహార్, హర్యానా రాష్ట్రాల్లో జరిగిన పేపర్ లీక్ వ్యవహారంలో టెలిగ్రామ్ యాప్ కీలకంగా మారిందని విచారణలో నిగ్గుతేలింది. 

సినిమా, ఇతర పైరేటెడ్ కంటెంట్....
సినిమా ఏదైనా సరే పైరేటెడ్ లింక్స్, వీడియోలు నిమిషాల్లో టెలిగ్రామ్ లో ప్రత్యక్షం అవుతున్నాయి. అదే విధంగా ఈ బుక్స్, పేరడీ సినిమా కంటెంట్.. ప్రభుత్వాలు బ్యాన్ చేసిన వెబ్ లింక్స్ అన్నీ సర్క్యులేట్ అవుతున్నాయి. సంగీతం, సాఫ్ట్ వేర్ కు సంబంధించి కంటెంట్ విస్తృతంగా వ్యాప్తి చెందుతుంది. 

సెన్సార్ లేకుండా విద్వేష ప్రసంగాలు....
టెలిగ్రామ్ లో వచ్చే వీడియోల్లో సెన్సార్ అనేది లేదు. నియంత్రణ అస్సలు లేదు. సామాజిక కోణంలో ఈ యాప్ నిర్వహణ ఫెయిల్ అయినట్లు చెబుతోంది విచారణ సంస్థ. విద్వేష ప్రసంగాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, అల్లర్లు, విధ్వంసాల వీడియోలు యథావిధిగా యాప్ లో వస్తుంది. దీని వల్ల చాలా దేశాల్లో అల్లర్లు పెరగటానికి కారణం అవుతుంది టెలిగ్రామ్ యాప్.

టెర్రిరిస్టులకు అడ్డాగా మారింది....
టెలిగ్రామ్ యాప్ ద్వారా టెర్రరిస్టులు తమ యాక్షన్ ప్లాన్లు, కార్యక్రమాలు చేస్తున్నారంటూ విచారణ సంస్థలు తేల్చాయి. ప్రపంచ వ్యాప్తంగా చాలా టెర్రిరిస్టు గ్రూపులు ఈ టెలిగ్రామ్ యాప్ ద్వారా కమ్యునికేషన్ చేసుకుంటున్నారనేది అభియోగాలు ఉన్నాయి.

Telegram app is going to be banned in India. Rapid steps are being taken in this direction. India's Cyber ​​Crime Coordination Center is already investigating. With the arrest of Telegram CEO Powell by the French government, the whole world focused on this issue. Many countries are thinking of banning the Telegram app. India is one of them. What are the reasons for banning the original Telegram app? Let's know in detail why they want to ban.

మరిన్ని వార్తల కోసం.... 
* మైనర్లు​ డ్రైవింగ్ చేయొద్దు ఇక్కడ క్లిక్ చేయండి
*  మంగళ్ హాట్ ఠాణాలో గణేశ్ విగ్రహాల ధ్వంసం ఇక్కడ క్లిక్ చేయండి
* వాల్నట్స్ నానబెట్టి తినాలా డైరెక్ట్ గా తినకూడదా ఇక్కడ క్లిక్ చేయండి
* సెప్టెంబరులో భారీగా సెలవులు విద్యార్థులకు ఉద్యోగులకి కూడా ఇక్కడ క్లిక్ చేయండి
* మహిళలు స్నానానికి వేడి నీళ్లు మంచివా చల్లటి నీళ్లు మంచివా ఇక్కడ క్లిక్ చేయండి
* బిగ్ బాస్ కంటెస్టెంట్లకు విజేతలకు రెమ్యునరేషన్ ఏ రేంజ్లో ఇస్తారు ఇక్కడ క్లిక్ చేయండి
* 10 ఏళ్లుగా సిగరెట్లు తాగుతున్నారా అర్జంట్‎గా ఈ 5 పరీక్షలు చేయించుకోండి ఇక్కడ క్లిక్ చేయండి
* పిల్లలు బ్రేక్​ ఫాస్ట్​ తినడానికి మారం చేస్తున్నారా అయితే ఇవి ట్రై చేయండి ఇక్కడ క్లిక్ చేయండి
* రుణమాఫీ కాని రైతులకు గుడ్‌న్యూస్ అందుబాటులోకి యాప్ ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies