ఫారెస్ట్ అడవి భూమి సాగు చేస్తే చర్యలు తప్పవు
బషీరాబాద్ Basheerabad News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం తెలంగాణ కర్ణాటక రాష్ట్ర సరిహద్దుల భూభాగం పాత్రలు తహసిల్దార్ వై వెంకటేశం, ఆర్ఐ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రాజేందర్ కలిసి పరిశీలన చేశారు. బషీరాబాద్ మండల పరిధిలో మైల్వార్ తండాకు చెందిన కొంతమంది రైతులు ఫారెస్ట్ అటవీ భూమిలో అక్కడక్కడ చెట్లను నరుకుతూ సాగు చేస్తున్నరని సమాచారం మేరకు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రాజేందర్, సెక్షన్ ఆఫీసర్ స్నేహ, వీర్య నాయక్, మమత వెళ్ళగా ఫారెస్ట్ అడవిలో సుమారు 5 ఎకరాల వరకు అక్కడక్కడ చెట్లను నరికి సాగు చేయటానికి ప్రయత్నిస్తున్నారని, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రాజేందర్ తెలిపారు.
ఈ సంఘటన పైన తాసిల్దార్ వై వెంకటేశం తో తెలంగాణ రాష్ట్రం కర్ణాటక రాష్ట్రం సరిహద్దు భూభాగానికి సంబంధించిన పత్రాలను పరిశీలిస్తూ త్వరలో ఉన్నత అధికారులకు నివేదిక పంపిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రాజేందర్ మాట్లాడుతూ ఫారెస్ట్ అటవీ భూములను లోలోపల చెట్లు నరికి వ్యవసాయం చేసే వారిపై బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని, ఎవరైనా ఫారెస్ట్ అడవి భూమిని సాగు చేయడానికి ప్రయత్నం చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అవసరమైతే జైలుకు పంపిస్తామని తెలిపారు.
Tehsildar Y Venkatesham, RI Forest Range Officer Rajender inspected the territory of Vikarabad District Basheerabad Mandal Telangana Karnataka state borders together. It is reported that some farmers belonging to Mylwar Tanda under Bashirabad mandal are cultivating by cutting down trees here and there in the forest land.According to Forest Range Officer Rajender, Section Officer Sneha, Virya Naik and Mamta, they are trying to cut and cultivate trees up to about 5 acres in the forest area,
Forest Range Officer Rajender said.On this incident, Tahsildar Y Venkatesham said that he will soon send a report to the higher authorities after examining the documents related to the border area of Telangana State and Karnataka State.On this occasion, Forest Range Officer Rajender said that a complaint has been filed in Bashirabad Police Station against those who cut down trees and cultivate within the forest lands.He informed that legal action will be taken against them if they try to cultivate the land and if necessary they will be sent to jail.