తాజ్‌మహల్‌కు పగుళ్లు
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : ఐకానిక్ కట్టడం ఆగ్రాలోని తాజ్‌మహల్‌పై పగుళ్లు కనిపించాయి. మహల్ గోడలు, కింది భాగంలోని అంచులపొంటి కూడా పలుచోట్ల పగుళ్లు వచ్చాయి. ప్రధాన డోమ్‌కు దగ్గరలోనూ ఓ మొక్క మొలిచింది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గతవారంలో మహల్ పరిసరాల్లో ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలకు ప్రధాన డోమ్లోంచి నీళ్లు లీక్ అయ్యాయి.
వరద ఉధృతికి యమునా నది మహల్ గోడను తాకుతూ ప్రవహించింది. మహల్ ఎదురుగా ఉన్న గార్డెన్ కూడా వరదనీటితో మునిగిపోయింది. ఇది జరిగి వారం గడవకముందే డోమ్‌పై మొక్క పెరగడం, గోడలకు పగుళ్లు రావడం ఆందోళన కలిగిస్తోంది. దీనిపై ఆగ్రా సర్కిల్ పురావస్తు శాఖ అధికారిని మీడియా ప్రశ్నించగా తాజ్ మహల్ మాత్రమే కాదు, స్మారక చిహ్నాలన్నింటి మూలల్లో మొక్కలు పెరగడం కామన్ అని చెప్పారు. అవి మొలకెత్తడం గమనించిన వెంటనే తొలగిస్తామని తెలిపారు.
Cracks have appeared on the iconic structure Taj Mahal in Agra. The walls of the mahal and the edges of the lower part were also cracked at many places. A plant also sprouted near the main dome. Videos and photos related to this went viral on social media on Friday. Mainly because of the incessant rains in the vicinity of the Mahal last week
The Yamuna river was overflowing and touching the wall of the palace. The garden in front of the Mahal was also flooded. Before a week has passed since this happened, plants are growing on the dome and the walls are getting cracks which is worrying. When the media questioned the Agra Circle Archeology Department Officer on this, not only the Taj Mahal, but the corners of all the monuments.